Tuesday, July 8, 2014


ద్వారకా తిరుమల (చిన్న తిరుపతి)

  పెద్ద తిరుపతి కి వస్తామని మొక్కి చిన్న తిరుపతి కి వెళ్ళిన పెద్ద వెంకన్న ఏమి అనుకోడేమో గాని చిన్న వెంకన్న దగ్గరికి వస్తానని పెద్ద తిరుపతికి వెళ్ళితే మాత్రం చిన్న వెంకన్నకి కోపం వస్తుంది అని చెప్పుతారు మా గోదావరి జిల్లాలలో.

ఏలూరు, పశ్చిమ గోదావరి జిల్లా నుంచి జంగారెడ్డిగూడెం వస్తుంటే కామవరపుకోట దగ్గర లోపలికి వెళ్ళితే చిన్నతిరుపతి వస్తుంది. సుమారు 42 కిలోమీటర్లు వుంటుంది.

ఇక్కడ శేషాద్రి కొండపై శ్రీ వేంకటేశ్వర స్వామి కొలువు దీరియున్నారు. ఇది ఉభయ గోదావరి, కృష్ణా జిల్లాల్లో చాలా ప్రసిద్ది చెందిన దేవాలయము. స్వయంభువుగా ప్రత్యక్షమైన వేంకటేశ్వర స్వామిని చీమల పుట్ట నుండి వెలికి తీసిన ద్వారక అనే ముని పేరు మీదుగా ఈ ప్రదేశమునకు ద్వారక తిరుమల అని పేరు వచ్చినది. ఆలయ విశేషాలకు వికీ లంకె చూడగలరు.


ఈస్ట్ యడవల్లి ఆలయ విశేషాలకు

దేవస్తానం వారి సైట్


నేను నా స్నేహితుడు 'శ్రీనివాస్' :), బైక్ పై జంగారెడ్డిగూడెం నుంచి ఈస్ట్ యడవల్లి , దొరసానిపాడు మీదుగా ద్వారకా తిరుమల వచ్చాము. ఈస్ట్ యడవల్లి వెంకటేశ్వర గుడి కూడా చాలా బావుంటుంది.

 




   

ప్రధాన గోపురం
 








గోశాల

తూర్పు ద్వారం గోపురం


వాహనశాల





భ్రమరాంబా మల్లేశ్వరస్వామి ఆలయం

శివోద్యానం పూలతోట








       దర్శనం చాలా బాగా జరిగింది. 

       గోశాలలలో వివిధ గ్రహాల అనుగ్రహం కోసం గోవులకు పెట్టె గ్రాసం వివరాలు అవి చార్ట్ లో వుంది. ఏదైనా కాని 100 రూపాయలు అని చెప్పారు.

      11 గంటల నుండి అన్న ప్రసాదమునకు టొకెన్స్ కింద కళ్యాణ మండపం లో ఇస్తారు. స్వామి వారి పాదాలు అక్కడ చూడవచ్చు. టొకెన్స్ తీసుకుని వేడి వేడి అన్న ప్రసాదాలు ఆరగించి ఆనందంగా తిరిగి వచ్చేసాము. 

Tuesday, June 24, 2014

కుక్కే సుబ్రహ్మణ్య స్వామి & ధర్మస్థల మంజునాథుల దర్శనం

ప్రఖ్యాతి గాంచిన 3 సుబ్రహ్మణ్య క్షేత్రాల గురించి మునుపు చెప్పినట్టు మిగిలిన కుక్కే సుబ్రహ్మణ్య క్షేత్రాన్ని దర్శించాలి అని నా మిత్రుడు సందీప్ తో శుక్రవారం రాత్రి బయలు దేరాను అని చెప్పటం కంటే ఈశ్వరుని అనుమతి లబించింది అని చెప్పటం సబబు కాబోలు :).

అస్సలు మా ప్రయాణమే ఒక అద్భుతం, ఇంకా నిశ్చయం కాలేదు అని ఇంకా వేల్లవేమో అనుకుని ఆఫీసు లో పని చేసుకుంటూ వుంటే ఇంకో రెండున్నర గంటల వుంది అనగా చార్ట్ ప్రిపేర్ ఐంది సీట్స్ నిశ్చయం అయ్యాయి అని మెసేజ్ రాగానే నేను బన్నెరు ఘట్ట నుంచి బీటియం కి పరుగు పెడితే మా వాడు వైట్ ఫీల్డ్ నుంచి మారతహళ్లి కి పరుగుపెట్టడం అక్కడ నుంచి రైల్వే స్టేషన్ కి క్రికెట్ మ్యాచ్ లో కూడా చూడాలేమో అన్నంత ఉత్కంట, కంగారు, భయం, టెన్షన్ ఒక మనిషి కి ఎన్ని ఫీలింగ్స్ ఉండాలో అన్ని చూపించాడు తండ్రి :).

ఇక్కడో ట్విస్ట్ చెప్పాలి. యెంత వెతికి మాకు నిశ్చయం ఐన రైలు కనిపించటం లేదు టీవీ స్క్రీన్ లో. తీరా చూస్తె కన్నూర్ ఎక్ష్ప్రెస్స్ మరియు కార్వార్ ఎక్ష్ప్రెస్స్ లకి కలిపి  ఒకే జంబో రైలు వుంది. టీవీ స్క్రీన్ లో కన్నూర్ ఎక్ష్ప్రెస్స్ ట్రైన్ నెంబర్ లో రెండు ఎక్ష్ప్రెస్స్ లు కలిపి చూపిస్తున్నాయి. ఇది మొదటిసారి చూడడంతో బాగా సందిగ్దం లో పడ్డాము. తీరా బోగీలు వెతుకుంటే చివరకి పొతే అక్కడ 3ర్ద్ AC ఇక్కడ కాదు మొదటిలోనే అనే చెప్పటం తో
మళ్లీ వత్తిడికి లోనయ్యాము. మేము వెళ్ళింది కరెక్ట్ అని వెంటనే గమనించటంతో ఊపిరి పీల్చుకుని ఆ రాత్రికి ప్రయాణం సాగించాము. ప్రొద్దునే 6 కల్లా సుబ్రహ్మణ్య రోడ్ కి రైలు సమయానికి చేరుకుంది.

సుబ్రమణ్య పురం రోడ్ స్టేషన్ ఫోటోలు చూడగలరు.









అక్కడ చాల టాక్షీలు, జీపులు వున్నాయి షేరింగ్ లో వెళ్ళవచ్చు. దారి అడవి మధ్యలో వంపులు తిరుగుతూ వెళుతున్నట్టు వుంది. వెళ్ళే దారిలోనే కుమారా తీర్ధం వుంది. అక్కడ ఆగేవాళ్ళు దిగిపోయారు. మేము దిగుదామనుకుని పెద్దగా తెలియకపోవటం వల్లనా, సౌకర్యాల శంకతో ఆగలేదు. ముందు దేవుడి దర్శనం పరమావధిగా వుంటుంది ఏమో కొందరికి :). కుమారా తీర్థానికి చాలా పురాతన చరిత్ర వుంది. దేవస్తానంలో అమ్మే పుస్తకంలో వుంది. వాసుకి కి, గరుత్మంతునికి, కుమ్మే సుబ్రమణ్య పేరు నామాంతరానికి ఇలా అన్ని విషయాలకి వున్నా సంబందాల గురించి తెలియపరుస్తూ విశదంగా వుంది. తెలుగు పుస్తకం లేకపోవటం వల్లనా ఇంగ్లీష్ కొన్నాము.

ఇంకా టెంపుల్ దగ్గర ఆలయం సదనం లో ఖాళీ లేకపోవటం వల్లనా ఒక లాడ్జీ (సాధనా 08257-281291) లో దిగాము. 300 రూపాయలు చెప్పినట్టు గుర్తు. స్నాదులు పూర్తి చేసుకుని దర్శనానికి వెళ్ళాము. దర్శనం బాగా జరిగింది. ఇక్కడ గమనించ వలసిన ఒక విషయం ఏమిటి అంటే మగవాళ్ళందరూ చొక్కా, బనీను తీసివేసి దర్శనం కి వెళ్ళాలి. ఆలయం లోపల అన్ని గుడులు అయిన తరువాత వేసుకోవాలి. కొందరు పంచె మీద వచ్చారు. చాల బాగా దర్శనం జరిగింది.

బయటకు వచ్చిన తరువాత ఆది సుబ్రహ్మణ్య అని వేరొక టెంపుల్ కూడా వుంది పక్కనే. అది తప్పని సరిగా దర్శనం చేసుకోండి. అక్కడ ఒక పుట్ట లో వున్నట్టు వుంటుంది.

ఇక్కడ గమనించిన విషయం ఏమిటి అంటే చాల మంది ని చూసిన వెంటనే వారి శరీర వర్ణం, కళ్ళ రంగు, ఇతర విషయాలు పరిశీలిస్తే చాల మంది గ్రహ దోషాలుతో బాధ పడుతున్నట్టు మనసుకి తోచింది. ఐనా జాతక, సర్ప దోషాలు వీటికి పేరుగాంచిన ఆలయమే కాబట్టి విడ్డూరమైన విషయం కాదు ఏమో !.

అక్కడ నుంచి ధర్మస్థల మంజునాథుని దర్శించాలని బయలుదేరాము. పచ్చని వాతావరణం, అడవి మొత్తం ప్రయాణం అంత మాతోనే వుంది అనిపించింది.

బయట కాళ్ళు కడుగుకొనుటకు ఎక్కడ పంపు కనిపించలేదు. ధర్మస్తల ఆలయం లో మగవాళ్ళు విధిగా చొక్కా, బనీను తీసివేసి మంజునాథుని దర్శించాలీ. ఎవరికి మినహాయింపు లేదు. మన తిరుపతిలాగా మెస్సలు వున్నాయి. ప్రొద్దున 11:00 నుంచి 12:00 కి విరామం. అప్పుడు లైన్ ఆపుతారు. దర్శనం బాగా జరిగింది. ఆలయం లోనే భోజన ప్రసాదం చేసాము. రెండు మూరుసార్లు మారు వస్తుంది. ఎవరు వదిలివేయ్యకుండా మంచి ఏర్పాటు.










A Hotel


ఇక అక్కడితో బాగా అలసిపోయవేమో ఇంకా బయలు దేరదాం అని బస్సు పట్టుకుని బెంగళూరు కి వచ్చేసాము.       

Monday, November 18, 2013

సోమేశ్వర ఆలయమ్, పాత మడివాల, బెంగళూరు


     ఇప్పుడు మనం చెప్పుకోబోయేది  చోళుల కాలం నాటి సోమేశ్వరుని ఆలయమ్. పరమశివుడు స్వయంభూగా సోమేశ్వరునిగా, మహిమల దేవుడిగా ఇక్కడ పూజలు అందుకుంటున్నాడు. ఈ ఆలయం చాలా పురాతనమైనదిగా చరిత్ర చెబుతున్నది. వికీ ప్రకారం ఇది చోలులకాలం 12 వ శతాబ్దం (1247 AD) ముందిదిగా కనిపిస్తుంది. సుమారు తొమ్మిది తరాలు ఒకే కుటుబం నుంచి స్వామి అర్చకులుగా పని చేస్తున్నారు అని మా స్నేహితుడు తెలిపాడు. తనూ, తన స్నేహితుడు ఉద్యోగ జీవనం లో ఎదుర్కొన్న ఇబ్బందులు స్వామి చేసిన లీలలు తను చెప్తుంటే నమ్మి నిలిచి ఒక అడుగు భగవంతుడు కోసం వేస్తె ఆయన మనకోసం ఎన్ని అడుగులో వేస్తాడో అనిపించింది. మరి మీరు ప్రయత్నిస్తారా ఒకసారి ).   

అర్చనకు 5 రూపాయల టికెట్ వుంది. అభిషేకాలు పూజలు అన్ని మామూలు గానే జరుగుతాయి. కార్తీక మాసం లో పర్వదినాలలో దీపాల వెలుగులో దేవాలయం వెలిగిపోతూ వుంటుంది. దీపాల శోభలో కార్తీక పౌర్ణమి రోజు చూడాలి ఆ సోయగం.

వినాయక స్వామి, ప్రథమ గణపతి, దక్షిణ మూర్తి, శ్రీనివాస స్వామి, సుబ్రహ్మనఎస్వర స్వామి, బ్రహ్మ, పార్వతి దేవి, అన్నపూర్ణేశ్వరి దేవి, ఆంజనేయ స్వామి, కాల భైరవ స్వామి, సూర్య భగవానులను అంతరాలయం లో ఇక్కడ చూడవచ్చు. అక్కడే యుపలాలుగా నవగ్రహాలు, అయ్యప్ప స్వామి దర్శనమిస్తారు.

చేరుకోవటం ఎలా

BTM దగ్గర భారతి AXA బిల్డింగ్ బస్సు స్టాప్ నుంచి రెండు నిమిషాలు సిల్క్ బోర్డు వైపు నడిస్తే ఎడం పక్కగా పవన్ హోటల్ వస్తుంది. ఆక్కడ ఎడం పక్క సందు లోకి ప్రవేశించి సందు చివరకు చేరుకోవాలి.  అక్కడ కుడివైపుకు తిరిగి ఒక నిమిషం నడిస్తే మరియమ్మ ఆలయం వస్తుంది ఆక్కడ నుంచి ఒక నిమిషం ఎడం వైపుగా నడిస్తే సోమేశ్వర ఆలయం కనిపిస్తుంది.

మరో మార్గం ఏమిటి అంటే, BTM దగ్గర భారతి AXA బిల్డింగ్ వెనకవైపుకు చేరుకొని సిల్క్ బోర్డు వైపుకు సందు లో నడుస్తుంటే మనకు మరియమ్మ ఆలయం, సోమేశ్వర ఆలయాలు వరసగా కనిపిస్తాయి. అక్కడ ఎవరిని అడిగిన దారి చెప్తారు.



       
కార్తీక పున్నమి నాడు చూడాలి స్వామి వైభవం



Saturday, November 2, 2013

నారాయణ ధామం, పూణే

పరమ ప్రశాంతమైన వాతావరణం, చుట్టూ అందమైన కొండలు, లేలేత పచ్చిక బయళ్ళు, కాలుష్య కోరలు పడని నేలలు, మంద్రంగా వీచే గాలి పాటలు,  వీటన్నిటికి మించిన వేంకటేశుని అందం !!! ఓహ్ ! చూడాలంటె పూణే శివార్లలో వున్న నారాయణ పూర్ వెళ్ళాల్సిందే.

శిరిడి యాత్ర ముగించుకున్న తరువాత పూణే లో వున్న స్నేహితుడిని చూడడానికి వెళ్లాను. తనతో పాటు నారాయణ ధామ్ చూడాలని బైక్ మీద మగరపట్ట నుండి ప్రయాణం మొదలెట్టాము. ఇది పూణే కి సుమారు 40-50 కిలోమీటర్స్ వస్తుంది. ఇది శివార్లలో చిన్న చిన్న పల్లెలు దాటుకుంటూ వెళుతుంది కాబట్టి ప్రయాణం చాలా ఆహ్లాదకరంగా సాగింది. వెళ్ళేదారిలో కొండలను చుట్టుముట్టిన మంచుతెరల మీద వెళుతున్నపుడు ఓహ్! అది వర్ణించవీలుకానిది. వెళ్ళేదారిలో పురాతన ఆలయం కనిపించింది కానీ వెళ్ళలేదు. ఎగుడు దిగుడు కొండలలో మలుపులు తిరుగుతూ ప్రయాణం చాలా బాగా సాగింది. దీనికి తోడూ సన్నపాటి వర్షం వల్ల అందం ద్విగునీకృతమైనదనిపించింది.

ఆలయ ఆవరణం లో ప్రవేశించగానే తెలుగు భక్తి గీతాలు విని ఆశ్చర్య పోయాను. ఇది తెలుగు వాళ్ళు కట్టించారు అని సుమారు 200 కోట్లు ఖర్చు ఐంది అని తెలుసుకున్నాక ఇంకా ఆశ్చర్యం వేసింది. పరిశుభ్రతకు, ప్రశాంతతకు, మరియు క్రమశిక్షణనకు మారు పేరులా వుంది. అన్నిటికి మించి భగవంతునికి దగ్గరగా వచ్చినట్టు వుంది. వేంకటేశ్వరుని దర్శనం చేసుకున్నప్పుడు ఆ అందం గురించి యెంత చెప్పినా తక్కువే అనిపించింది. పెద్ద తిరుపతి లో ఎలా ఐతే పూజాది కార్యక్రమాలు జరుగుతాయో అన్ని అలానే జరుగుతాయి అని పూజారులు చెప్పారు. వారు తెలుగు వారేనని తిరుపతి గుడిలో పని చేసారని ఆ రోజు బ్రహ్మోత్సవాలు మొదటి రోజు అని చెప్పారు. మాకు కొంత ఆశ్చర్యం కొంత ఆనందం వేసాయి. పర్వదినాలు మనం గుర్తుపెట్టుకున్నమ లేదా అని కాక భగవంతుడు మనకు గుర్తుచేసేలాగా మన అంతరిక భక్తీ, సాన్నిహిత్యం వుండడం ముఖ్యం అనిపించింది :). దేవాలయం ఆలయ దర్శనం పూర్తిగా ఉచితం. చాలా అతి కొద్ది దెవాలయలలో మాత్రమే మనం ఇది చూస్తాము అనుకుంటా. ఉపాలయాలు అన్ని దర్శించుకున్నాము. దశావతారముల కథాక్రమం తో దేవాలయం పై చెక్కిన ప్రతిమలు బావున్నాయి. దేవాలయం లో అందరికి లడ్డు ఉచిత ప్రసాదంగా  ఇచ్చారు. దేవాలయ అన్నదానం సత్రం కి వెళ్ళాము. నిర్వహణ చాలా బావుంది. ఎంత తిన్నా పెడతారు కాని కొద్ది కొద్దిగ పలు దఫాలుగా పెడతారు. అనవసరంగా వృథా చెయ్యకూడదు అన్న వాళ్ళ సంకల్పం నచ్చింది. ముఖ్యం గా అన్నదాన సత్రాలు పరిశుబ్రంగా నిర్వహించటం చాలా కష్టం అనుకుంటున్నా. దేవాలయ దర్శనం ముగించుకుని బయటకు వచ్చిన వెంటనే పరిసరాలలో సీతాపలాలు కనిపించాయి. సీజన్లో లో మొదటి సారిగా మొదటిది తిన్నానేమో అత్యద్భుతం గా వుంది. ఇక పరిసరాలు చూసుకుంటూ తిరుగు ప్రయాణం ఐయ్యాము.












ప్రసన్న వెంకటేశ్వర స్వామి, చిక్క తిరుపతి - మన వూరి దేవుడు.





   కొన్ని ఆలయాలు శక్తి వంతంగా వున్నా ఆదరణకు ఆమడ దూరంలో వుంటాయి. కొన్ని ఆలయాలు కాస్త అటు ఇటు గా వున్నా ఆదరణలో మాత్రం చాల ముందు వరసలో ఉంటాయి. అగ్ని ప్రతిష్టత చిక్క తిరుపతి వేంకటేశ్వరుని ఆలయం మొదటి కోవలోకి వచ్చేలాగ వుంది. చిన్నపుడు  దైవం, అందరు ఒకచోట భజానా కాలక్షేపం లాంటివి రాములవారి గుడిలో జరుగుతుండేవి. ఇపుడు సాయి బాబా ఆలయాలలో జరుగుతున్నాయి. ప్రదాన రహదారికి ఆనుకునే వున్న ఈ ఆలయమ్ బెంగుళూరుకి డెబ్బై కిలోమీటర్స్ వస్తుంది. బస్సు లో ఐతే మలూర్ కి యాభై కిలోమీటర్స్ అక్కడ నుండి సరాసరి గుడి కి 20 కిలోమీటర్స్ వస్తుంది. ఎలెక్ట్రానిక్ సిటీ మీదుగా బైక్ లో వెళ్ళితే నలబై కిలోమీటర్స్ లోపే అని స్నేహితుడు చెప్పాడు. ఎప్పటిలాగే మేజస్టిక్ బస్సు స్టాండ్ దగ్గర వున్న APSRTC బస్సు స్టాండ్ నుంచి మాలుర్ కి వెళ్లి అక్కడ నుండి చిక్క తిరుపతి బస్సు లో వెళ్ళాము. కోలార్ మీద నుంచి కూడా రూట్ వుంది అని తెలిసింది. ఇది కోలార్ జిల్లా లోకే వస్తుంది.  అక్కడ కోటి లింగాలను దర్శించి వచ్చేవాళ్ళు ఉండవచ్చు. ఆలయం దర్శనం కి మేము వెళ్ళే సరికి మధ్యానం అయిపోయింది. ఇక సాయత్రం దర్శనమే అనుకునే సమయానికి తెలిసిన విషయం ఏమిటి అంటే బ్రేక్ వుండదు, సాయత్రం వరకు ఆలయం తెరిచే వుంటుంది అని :). భగవంతుని అపార దయ అంటే ఇదే అని పించింది. పొద్దున్న నుంచి ఏమి తినలేదు జీవుడిని నిలబెట్టటానికి ఏదో కొద్దిగా ఆపదర్మంగా స్వీకరించాము. ఆలాంటి సమయం లో ఇలాంటి వార్త అంటే మీరే ఊహించుకోవండి :). దర్శనం చాల బాగా జరిగింది. భగవంతుని సమర్పించిన దండలను పూజారి గారు ప్రతి ఒక్కరి మేడలో వేస్తుంటే చాల చిత్రమైన ఫీలింగ్ ల అనిపించింది VIP దర్శనం లా :). ఆలయం లో కోతుల హడావుడి కనిపించింది పాపం ఆకలితో అవి ఏవి ఏవి దొరుకుతాయ అని ఎదురుచూస్తునట్టు అనిపించింది. ప్రసాదం స్వీకరించి తిరుగు ప్రయాణం అయ్యాము. కాస్త జన జీవన స్రవంతి నుంచి దూరంగా వుండి వచ్చాము అనిపించింది. ఎలా అంటే మన వూరి రాముల వారి గుడిలోకి వెళ్లివచ్చినట్టు.












మరిన్ని 
విశేషాలకు ఈ క్రింది లింక్ పరిశీలించగలరు

http://www.vishnutemplesofkarnataka.info/Kolar/mallurchikkatirupathi.htm