Tuesday, August 5, 2014

ఇస్కాన్ (రాధా కృష్ణ) ఆలయం - బెంగళూరు

అన్ని '8' లే. నా జీవితం అనే నాటకం లోనే కాదు ఈరోజు కూడా శనైశ్చరుడు ప్రభావం బాగా వుంది అనుకున్నా. వారం కూడా శనివారం. నాతో వచ్చిన అబ్బాయికుడా నల్ల చొక్కనే :). బస్సు నెంబర్ 80A, 8 వ ప్లాట్ఫారం నుండి బస్సు పట్టుకుని ఇస్కాన్ సిగ్నల్ దగ్గర దిగాము. అక్కడ నుంచి కొంచెం దూరం నడవాలి. అది మెట్రో ఫ్లై ఓవర్ కింద నుంచి వెళ్తూ ఉంటాము. ఇస్కాన్ చేరుకున్నాక, రాధా కృష్ణ ఆలయం ఇస్కాన్ అని కనపడుతుంది. ప్రధాన ద్వారం దగ్గర వాహనాల పార్కింగ్ కి ఒక రూట్ వుంటుంది మరొక రూట్ మెట్ల మీద నుంచి నడిచేవారికి. సెక్యూరిటీ చెక్ ఐయ్యాక చెప్పుల స్టాండ్ దగ్గర టోకెన్ తీసుకుని అల నడచుకుంటూ వెళుతుంటే, మెట్లమీదుగా నడిచేవారి పాదాలు తడిచేల పైపుల నుండి ఏర్పాటు చేసారు. జాగ్రతగా కడుక్కోవటానికి ప్రయతించాను. కాళ్ళు సరిగా తడవాలంటారు కదా మరి పెద్దలు. అలా వెళ్తుంటే చిత్రంగా తిరుపతి 'Q' కాంప్లెక్స్ లో వెళ్ళినట్లు వుంటుంది. ప్రధాన ద్వారానికి దర్శనానికి దారి అంటూ కుడి వైపు ఒక బోర్డు, ఎడమ పక్కన 'హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ కృష్ణ హరే రామ హరే రామ రామ రామ హరే హరే ' అనుకుంటూ ఒక్క భక్తుడు ఒక్కొక్క నామానికి ఒక్కొక్క రాయి మీద కదులుతూ మరొక దారి ముందుకు సాగటం నయనానందకరం గ కనిపిస్తుంది. కొంచెం కష్టం (భక్తీ లో కుదురుకొకపొతె) అనిపించినా చాల మంచి అనుభూతిని ఇస్తుంది ఎడమ పక్క దారి. ప్రతి ఒక్కరు కూడా ఎడమ వైపు నుండి ఒక్కక్క మెట్టు దాటుతూ ఆలయ ప్రధాన ద్వారం వద్దకు చేరుకుంటారు. ఈలోపు వేంకటేశ్వరుని దర్శనం కూడా అవుతుంది. హనుమాన్, మరియు ఇతర చిన్న వుపాలయాలు లాగా ఉంటాయి. ప్రధాన ద్వారానికి దగ్గరగా ఫోటోగ్రఫీ నిషిద్దం అనే ప్రకటన వుంటుంది. అక్కడ నుండి ఆలయం లోనికి వెళ్ళగానే బంగారపు మండపంలో శ్రీశ్రీ గౌరంగ నితాయీ, శ్రీశ్రీ రాధా కృష్ణ, శ్రీశ్రీ బలరామ కృష్ణ అంటూ విగ్రహాలు ఒకే మండపం లో మూడు గదులుగా దర్శనమిస్తాయి . మేము వెళ్లేసరికి చిన్న కచేరి లాగా జరుగుతుంది. దర్శనం చేసుకుని వస్తుంటే ఆలయం వాళ్ళ బుక్ స్టాల్స్ కనిపిస్తాయి. ప్రసాదాలు, ఇతర తీపి పదార్దాలు, వంటకాలు స్టాల్స్ లో వున్నాయి. కొంచెం వాణిజ్య విలువులతో కూడిన దేవాలయం అని అనిపిస్తుంది. ఒకచోట ఆర్టికల్ షాప్ లో వీటి మీద వచ్చే ఆదాయం సంక్షేమ కార్యకలాపాలు వినియోగించాబడతాయి అని రాయబడిన ప్రకటన దర్శనమిచ్చింది. మా స్నేహితుడి ఇంతకు ముందు యేవో ప్రత్యెక ప్రోగ్రాం లో పాల్గొన్నాడు. ఇంతకుముందు. ఇస్కాన్ ఇతర దేవాలయ / ఆధ్యాత్మికత సంస్థ ల కాక కొంచెం పాశ్చాత్యుల అప్ప్రోచ్ కనపడటానికి కారణం కూడా మన వాళ్లకి ఆ దారిలో చెప్పితే కాని వంట బట్టించుకోరు అని ఇస్కాన్ లో చెప్పినట్టు చెప్పాడు.

దేనికా మాట చెప్పు కోవాలి ఇస్కాన్ వాళ్ళ ఆహారపదార్ధాలు దేనికి వంక పెట్టలేము. అంత బావుంటై. బయటకు వస్తుంటే ఇస్కాన్ ప్రసాదం పెట్టారు వేడిగా. బయటకు వస్తుంటే ఒకపక్కగా కళ్యాణ మండపం కనిపించింది. పక్కన వున్న రాళ్ళ మీద నుండి జారిపడే జలపాతం కొంచెం ఆహ్లాదంగా కనిపించింది. అక్కడ నుండి బయటకు వచ్చి పక్కనే వున్నా ఓరియన్ మాల్ కి వెళ్లి కాసేపు ఉండి వచ్చేసాము. ఇస్కాన్ సందర్శనకి వెళ్ళే వాళ్ళు అక్కడ ఇస్కాన్ తో పాటు దగ్గరే వున్న
ఓరియన్ మాల్ మరియు మెట్రో కూడా చూసి రావచ్చు. 



















Tuesday, July 8, 2014


ద్వారకా తిరుమల (చిన్న తిరుపతి)

  పెద్ద తిరుపతి కి వస్తామని మొక్కి చిన్న తిరుపతి కి వెళ్ళిన పెద్ద వెంకన్న ఏమి అనుకోడేమో గాని చిన్న వెంకన్న దగ్గరికి వస్తానని పెద్ద తిరుపతికి వెళ్ళితే మాత్రం చిన్న వెంకన్నకి కోపం వస్తుంది అని చెప్పుతారు మా గోదావరి జిల్లాలలో.

ఏలూరు, పశ్చిమ గోదావరి జిల్లా నుంచి జంగారెడ్డిగూడెం వస్తుంటే కామవరపుకోట దగ్గర లోపలికి వెళ్ళితే చిన్నతిరుపతి వస్తుంది. సుమారు 42 కిలోమీటర్లు వుంటుంది.

ఇక్కడ శేషాద్రి కొండపై శ్రీ వేంకటేశ్వర స్వామి కొలువు దీరియున్నారు. ఇది ఉభయ గోదావరి, కృష్ణా జిల్లాల్లో చాలా ప్రసిద్ది చెందిన దేవాలయము. స్వయంభువుగా ప్రత్యక్షమైన వేంకటేశ్వర స్వామిని చీమల పుట్ట నుండి వెలికి తీసిన ద్వారక అనే ముని పేరు మీదుగా ఈ ప్రదేశమునకు ద్వారక తిరుమల అని పేరు వచ్చినది. ఆలయ విశేషాలకు వికీ లంకె చూడగలరు.


ఈస్ట్ యడవల్లి ఆలయ విశేషాలకు

దేవస్తానం వారి సైట్


నేను నా స్నేహితుడు 'శ్రీనివాస్' :), బైక్ పై జంగారెడ్డిగూడెం నుంచి ఈస్ట్ యడవల్లి , దొరసానిపాడు మీదుగా ద్వారకా తిరుమల వచ్చాము. ఈస్ట్ యడవల్లి వెంకటేశ్వర గుడి కూడా చాలా బావుంటుంది.

 




   

ప్రధాన గోపురం
 








గోశాల

తూర్పు ద్వారం గోపురం


వాహనశాల





భ్రమరాంబా మల్లేశ్వరస్వామి ఆలయం

శివోద్యానం పూలతోట








       దర్శనం చాలా బాగా జరిగింది. 

       గోశాలలలో వివిధ గ్రహాల అనుగ్రహం కోసం గోవులకు పెట్టె గ్రాసం వివరాలు అవి చార్ట్ లో వుంది. ఏదైనా కాని 100 రూపాయలు అని చెప్పారు.

      11 గంటల నుండి అన్న ప్రసాదమునకు టొకెన్స్ కింద కళ్యాణ మండపం లో ఇస్తారు. స్వామి వారి పాదాలు అక్కడ చూడవచ్చు. టొకెన్స్ తీసుకుని వేడి వేడి అన్న ప్రసాదాలు ఆరగించి ఆనందంగా తిరిగి వచ్చేసాము. 

Tuesday, June 24, 2014

కుక్కే సుబ్రహ్మణ్య స్వామి & ధర్మస్థల మంజునాథుల దర్శనం

ప్రఖ్యాతి గాంచిన 3 సుబ్రహ్మణ్య క్షేత్రాల గురించి మునుపు చెప్పినట్టు మిగిలిన కుక్కే సుబ్రహ్మణ్య క్షేత్రాన్ని దర్శించాలి అని నా మిత్రుడు సందీప్ తో శుక్రవారం రాత్రి బయలు దేరాను అని చెప్పటం కంటే ఈశ్వరుని అనుమతి లబించింది అని చెప్పటం సబబు కాబోలు :).

అస్సలు మా ప్రయాణమే ఒక అద్భుతం, ఇంకా నిశ్చయం కాలేదు అని ఇంకా వేల్లవేమో అనుకుని ఆఫీసు లో పని చేసుకుంటూ వుంటే ఇంకో రెండున్నర గంటల వుంది అనగా చార్ట్ ప్రిపేర్ ఐంది సీట్స్ నిశ్చయం అయ్యాయి అని మెసేజ్ రాగానే నేను బన్నెరు ఘట్ట నుంచి బీటియం కి పరుగు పెడితే మా వాడు వైట్ ఫీల్డ్ నుంచి మారతహళ్లి కి పరుగుపెట్టడం అక్కడ నుంచి రైల్వే స్టేషన్ కి క్రికెట్ మ్యాచ్ లో కూడా చూడాలేమో అన్నంత ఉత్కంట, కంగారు, భయం, టెన్షన్ ఒక మనిషి కి ఎన్ని ఫీలింగ్స్ ఉండాలో అన్ని చూపించాడు తండ్రి :).

ఇక్కడో ట్విస్ట్ చెప్పాలి. యెంత వెతికి మాకు నిశ్చయం ఐన రైలు కనిపించటం లేదు టీవీ స్క్రీన్ లో. తీరా చూస్తె కన్నూర్ ఎక్ష్ప్రెస్స్ మరియు కార్వార్ ఎక్ష్ప్రెస్స్ లకి కలిపి  ఒకే జంబో రైలు వుంది. టీవీ స్క్రీన్ లో కన్నూర్ ఎక్ష్ప్రెస్స్ ట్రైన్ నెంబర్ లో రెండు ఎక్ష్ప్రెస్స్ లు కలిపి చూపిస్తున్నాయి. ఇది మొదటిసారి చూడడంతో బాగా సందిగ్దం లో పడ్డాము. తీరా బోగీలు వెతుకుంటే చివరకి పొతే అక్కడ 3ర్ద్ AC ఇక్కడ కాదు మొదటిలోనే అనే చెప్పటం తో
మళ్లీ వత్తిడికి లోనయ్యాము. మేము వెళ్ళింది కరెక్ట్ అని వెంటనే గమనించటంతో ఊపిరి పీల్చుకుని ఆ రాత్రికి ప్రయాణం సాగించాము. ప్రొద్దునే 6 కల్లా సుబ్రహ్మణ్య రోడ్ కి రైలు సమయానికి చేరుకుంది.

సుబ్రమణ్య పురం రోడ్ స్టేషన్ ఫోటోలు చూడగలరు.









అక్కడ చాల టాక్షీలు, జీపులు వున్నాయి షేరింగ్ లో వెళ్ళవచ్చు. దారి అడవి మధ్యలో వంపులు తిరుగుతూ వెళుతున్నట్టు వుంది. వెళ్ళే దారిలోనే కుమారా తీర్ధం వుంది. అక్కడ ఆగేవాళ్ళు దిగిపోయారు. మేము దిగుదామనుకుని పెద్దగా తెలియకపోవటం వల్లనా, సౌకర్యాల శంకతో ఆగలేదు. ముందు దేవుడి దర్శనం పరమావధిగా వుంటుంది ఏమో కొందరికి :). కుమారా తీర్థానికి చాలా పురాతన చరిత్ర వుంది. దేవస్తానంలో అమ్మే పుస్తకంలో వుంది. వాసుకి కి, గరుత్మంతునికి, కుమ్మే సుబ్రమణ్య పేరు నామాంతరానికి ఇలా అన్ని విషయాలకి వున్నా సంబందాల గురించి తెలియపరుస్తూ విశదంగా వుంది. తెలుగు పుస్తకం లేకపోవటం వల్లనా ఇంగ్లీష్ కొన్నాము.

ఇంకా టెంపుల్ దగ్గర ఆలయం సదనం లో ఖాళీ లేకపోవటం వల్లనా ఒక లాడ్జీ (సాధనా 08257-281291) లో దిగాము. 300 రూపాయలు చెప్పినట్టు గుర్తు. స్నాదులు పూర్తి చేసుకుని దర్శనానికి వెళ్ళాము. దర్శనం బాగా జరిగింది. ఇక్కడ గమనించ వలసిన ఒక విషయం ఏమిటి అంటే మగవాళ్ళందరూ చొక్కా, బనీను తీసివేసి దర్శనం కి వెళ్ళాలి. ఆలయం లోపల అన్ని గుడులు అయిన తరువాత వేసుకోవాలి. కొందరు పంచె మీద వచ్చారు. చాల బాగా దర్శనం జరిగింది.

బయటకు వచ్చిన తరువాత ఆది సుబ్రహ్మణ్య అని వేరొక టెంపుల్ కూడా వుంది పక్కనే. అది తప్పని సరిగా దర్శనం చేసుకోండి. అక్కడ ఒక పుట్ట లో వున్నట్టు వుంటుంది.

ఇక్కడ గమనించిన విషయం ఏమిటి అంటే చాల మంది ని చూసిన వెంటనే వారి శరీర వర్ణం, కళ్ళ రంగు, ఇతర విషయాలు పరిశీలిస్తే చాల మంది గ్రహ దోషాలుతో బాధ పడుతున్నట్టు మనసుకి తోచింది. ఐనా జాతక, సర్ప దోషాలు వీటికి పేరుగాంచిన ఆలయమే కాబట్టి విడ్డూరమైన విషయం కాదు ఏమో !.

అక్కడ నుంచి ధర్మస్థల మంజునాథుని దర్శించాలని బయలుదేరాము. పచ్చని వాతావరణం, అడవి మొత్తం ప్రయాణం అంత మాతోనే వుంది అనిపించింది.

బయట కాళ్ళు కడుగుకొనుటకు ఎక్కడ పంపు కనిపించలేదు. ధర్మస్తల ఆలయం లో మగవాళ్ళు విధిగా చొక్కా, బనీను తీసివేసి మంజునాథుని దర్శించాలీ. ఎవరికి మినహాయింపు లేదు. మన తిరుపతిలాగా మెస్సలు వున్నాయి. ప్రొద్దున 11:00 నుంచి 12:00 కి విరామం. అప్పుడు లైన్ ఆపుతారు. దర్శనం బాగా జరిగింది. ఆలయం లోనే భోజన ప్రసాదం చేసాము. రెండు మూరుసార్లు మారు వస్తుంది. ఎవరు వదిలివేయ్యకుండా మంచి ఏర్పాటు.










A Hotel


ఇక అక్కడితో బాగా అలసిపోయవేమో ఇంకా బయలు దేరదాం అని బస్సు పట్టుకుని బెంగళూరు కి వచ్చేసాము.