ద్వారకా తిరుమల (చిన్న తిరుపతి)
పెద్ద తిరుపతి కి వస్తామని మొక్కి చిన్న తిరుపతి కి వెళ్ళిన పెద్ద వెంకన్న ఏమి అనుకోడేమో గాని చిన్న వెంకన్న దగ్గరికి వస్తానని పెద్ద తిరుపతికి వెళ్ళితే మాత్రం చిన్న వెంకన్నకి కోపం వస్తుంది అని చెప్పుతారు మా గోదావరి జిల్లాలలో.
ఏలూరు, పశ్చిమ గోదావరి జిల్లా నుంచి జంగారెడ్డిగూడెం వస్తుంటే కామవరపుకోట దగ్గర లోపలికి వెళ్ళితే చిన్నతిరుపతి వస్తుంది. సుమారు 42 కిలోమీటర్లు వుంటుంది.
ఇక్కడ శేషాద్రి కొండపై శ్రీ వేంకటేశ్వర స్వామి కొలువు దీరియున్నారు. ఇది ఉభయ గోదావరి, కృష్ణా జిల్లాల్లో చాలా ప్రసిద్ది చెందిన దేవాలయము. స్వయంభువుగా ప్రత్యక్షమైన వేంకటేశ్వర స్వామిని చీమల పుట్ట నుండి వెలికి తీసిన ద్వారక అనే ముని పేరు మీదుగా ఈ ప్రదేశమునకు ద్వారక తిరుమల అని పేరు వచ్చినది. ఆలయ విశేషాలకు వికీ లంకె చూడగలరు.
ఈస్ట్ యడవల్లి ఆలయ విశేషాలకు
దేవస్తానం వారి సైట్
నేను నా స్నేహితుడు 'శ్రీనివాస్' :), బైక్ పై జంగారెడ్డిగూడెం నుంచి ఈస్ట్ యడవల్లి , దొరసానిపాడు మీదుగా ద్వారకా తిరుమల వచ్చాము. ఈస్ట్ యడవల్లి వెంకటేశ్వర గుడి కూడా చాలా బావుంటుంది.
![]() |
ప్రధాన గోపురం |
![]() |
గోశాల |
![]() |
తూర్పు ద్వారం గోపురం |
![]() |
వాహనశాల |
![]() |
భ్రమరాంబా మల్లేశ్వరస్వామి ఆలయం |
![]() |
శివోద్యానం పూలతోట |
దర్శనం చాలా బాగా జరిగింది.
గోశాలలలో వివిధ గ్రహాల అనుగ్రహం కోసం గోవులకు పెట్టె గ్రాసం వివరాలు అవి చార్ట్ లో వుంది. ఏదైనా కాని 100 రూపాయలు అని చెప్పారు.
11 గంటల నుండి అన్న ప్రసాదమునకు టొకెన్స్ కింద కళ్యాణ మండపం లో ఇస్తారు. స్వామి వారి పాదాలు అక్కడ చూడవచ్చు. టొకెన్స్ తీసుకుని వేడి వేడి అన్న ప్రసాదాలు ఆరగించి ఆనందంగా తిరిగి వచ్చేసాము.