ఇస్కాన్ (రాధా కృష్ణ) ఆలయం - బెంగళూరు
అన్ని '8' లే. నా జీవితం అనే నాటకం లోనే కాదు ఈరోజు కూడా శనైశ్చరుడు ప్రభావం బాగా వుంది అనుకున్నా. వారం కూడా శనివారం. నాతో వచ్చిన అబ్బాయికుడా నల్ల చొక్కనే :). బస్సు నెంబర్ 80A, 8 వ ప్లాట్ఫారం నుండి బస్సు పట్టుకుని ఇస్కాన్ సిగ్నల్ దగ్గర దిగాము. అక్కడ నుంచి కొంచెం దూరం నడవాలి. అది మెట్రో ఫ్లై ఓవర్ కింద నుంచి వెళ్తూ ఉంటాము. ఇస్కాన్ చేరుకున్నాక, రాధా కృష్ణ ఆలయం ఇస్కాన్ అని కనపడుతుంది. ప్రధాన ద్వారం దగ్గర వాహనాల పార్కింగ్ కి ఒక రూట్ వుంటుంది మరొక రూట్ మెట్ల మీద నుంచి నడిచేవారికి. సెక్యూరిటీ చెక్ ఐయ్యాక చెప్పుల స్టాండ్ దగ్గర టోకెన్ తీసుకుని అల నడచుకుంటూ వెళుతుంటే, మెట్లమీదుగా నడిచేవారి పాదాలు తడిచేల పైపుల నుండి ఏర్పాటు చేసారు. జాగ్రతగా కడుక్కోవటానికి ప్రయతించాను. కాళ్ళు సరిగా తడవాలంటారు కదా మరి పెద్దలు. అలా వెళ్తుంటే చిత్రంగా తిరుపతి 'Q' కాంప్లెక్స్ లో వెళ్ళినట్లు వుంటుంది. ప్రధాన ద్వారానికి దర్శనానికి దారి అంటూ కుడి వైపు ఒక బోర్డు, ఎడమ పక్కన 'హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ కృష్ణ హరే రామ హరే రామ రామ రామ హరే హరే ' అనుకుంటూ ఒక్క భక్తుడు ఒక్కొక్క నామానికి ఒక్కొక్క రాయి మీద కదులుతూ మరొక దారి ముందుకు సాగటం నయనానందకరం గ కనిపిస్తుంది. కొంచెం కష్టం (భక్తీ లో కుదురుకొకపొతె) అనిపించినా చాల మంచి అనుభూతిని ఇస్తుంది ఎడమ పక్క దారి. ప్రతి ఒక్కరు కూడా ఎడమ వైపు నుండి ఒక్కక్క మెట్టు దాటుతూ ఆలయ ప్రధాన ద్వారం వద్దకు చేరుకుంటారు. ఈలోపు వేంకటేశ్వరుని దర్శనం కూడా అవుతుంది. హనుమాన్, మరియు ఇతర చిన్న వుపాలయాలు లాగా ఉంటాయి. ప్రధాన ద్వారానికి దగ్గరగా ఫోటోగ్రఫీ నిషిద్దం అనే ప్రకటన వుంటుంది. అక్కడ నుండి ఆలయం లోనికి వెళ్ళగానే బంగారపు మండపంలో శ్రీశ్రీ గౌరంగ నితాయీ, శ్రీశ్రీ రాధా కృష్ణ, శ్రీశ్రీ బలరామ కృష్ణ అంటూ విగ్రహాలు ఒకే మండపం లో మూడు గదులుగా దర్శనమిస్తాయి . మేము వెళ్లేసరికి చిన్న కచేరి లాగా జరుగుతుంది. దర్శనం చేసుకుని వస్తుంటే ఆలయం వాళ్ళ బుక్ స్టాల్స్ కనిపిస్తాయి. ప్రసాదాలు, ఇతర తీపి పదార్దాలు, వంటకాలు స్టాల్స్ లో వున్నాయి. కొంచెం వాణిజ్య విలువులతో కూడిన దేవాలయం అని అనిపిస్తుంది. ఒకచోట ఆర్టికల్ షాప్ లో వీటి మీద వచ్చే ఆదాయం సంక్షేమ కార్యకలాపాలు వినియోగించాబడతాయి అని రాయబడిన ప్రకటన దర్శనమిచ్చింది. మా స్నేహితుడి ఇంతకు ముందు యేవో ప్రత్యెక ప్రోగ్రాం లో పాల్గొన్నాడు. ఇంతకుముందు. ఇస్కాన్ ఇతర దేవాలయ / ఆధ్యాత్మికత సంస్థ ల కాక కొంచెం పాశ్చాత్యుల అప్ప్రోచ్ కనపడటానికి కారణం కూడా మన వాళ్లకి ఆ దారిలో చెప్పితే కాని వంట బట్టించుకోరు అని ఇస్కాన్ లో చెప్పినట్టు చెప్పాడు.
దేనికా మాట చెప్పు కోవాలి ఇస్కాన్ వాళ్ళ ఆహారపదార్ధాలు దేనికి వంక పెట్టలేము. అంత బావుంటై. బయటకు వస్తుంటే ఇస్కాన్ ప్రసాదం పెట్టారు వేడిగా. బయటకు వస్తుంటే ఒకపక్కగా కళ్యాణ మండపం కనిపించింది. పక్కన వున్న రాళ్ళ మీద నుండి జారిపడే జలపాతం కొంచెం ఆహ్లాదంగా కనిపించింది. అక్కడ నుండి బయటకు వచ్చి పక్కనే వున్నా ఓరియన్ మాల్ కి వెళ్లి కాసేపు ఉండి వచ్చేసాము. ఇస్కాన్ సందర్శనకి వెళ్ళే వాళ్ళు అక్కడ ఇస్కాన్ తో పాటు దగ్గరే వున్న ఓరియన్ మాల్ మరియు మెట్రో కూడా చూసి రావచ్చు.