Sunday, September 7, 2014

గవి గంగాధరేశ్వర ఆలయం

బెంగళూరులో వున్న అత్యంత పురాతనమైన ఆలయాలు గురించి మా స్నేహితుడి ద్వారా తెలిసింది. అవి మూడు వున్నాయి. సోమేశ్వర ఆలయం గురించి ఇంతకు మునుపు చెప్పాను.  గవి గంగాధరేశ్వరుని మరొక ఆలయం ఐతే, ఆఖరుది హలసూరు సోమేశ్వర ఆలయం.

     గవి గంగాధరేశ్వర ఆలయం భారత దేశం లో వున్న అత్యంత పురాతనమైన గుహాలయాలలో ప్రసిద్ధి చెందిన ఒక ఆలయం. గౌతమ మహర్షి తపస్సు చేయటం వల్లన గౌతమ క్షేత్రం అని కూడా అంటారు. గవి అంటే గుహ. ఈ ఆలయం 9 వ శతాబ్దం లో నిర్మించి నట్లుగా భారతీయ ఖగోళ, నిర్మాణ శాస్త్రం లో నిష్ణాతలు నిర్మించిట్లుగా అబ్బురపరిచే రీతిలో ఒక పెద్ద రాతి నుండి నిర్మించారు అని తెలియవచ్చింది. సూర్యకిరణాలు గవి గంగాధరేశ్వరుని అభిషేకించటం ఇక్కడ ప్రత్యేకత. 

    ఈరోజు గవి గంగాధరేశ్వరుని దర్శించాలి అని మునుపు అనుకొన్నాము. అనుకున్నట్లు గానే నేను నా స్నేహితుడు, BTM నుంచి ఆటో పట్టుకుని గాంధీ బజార్ మీదుగా ఆలయానికి చేరుకున్నాము. ఆలయ వాతావ
ణం ప్రశాంతంగా వుంది. ఇది గుహాలయం లోపల చదనుగా ఉండదు. లోపల రెండు ప్రదక్షిణా మార్గాలు వున్నాయి. కొంచెం వంగుని వెళ్ళాలి. ఇక్కడ దుర్గ, పార్వతుల వుపాలయాలు వున్నాయి. ప్రదక్షిణా మార్గంలో దేవ (అరుదుగా కనిపించే అగ్ని విగ్రహం తో పాటు), ఋషుల విగ్రహాలు వున్నాయి. కాశికి మార్గం అని ఒక సొరంగం కనపడింది. ఇక్కడే భరద్వాజ, గౌతమ మహర్షులు తపస్సు చేసారని తెలియబడినది. ప్రతి సంవత్సరం మకర సంక్రాంతి రోజు సూర్యుని కిరణాలు శివ ద్వారం గుండా, తరువాత్ నంది కొమ్ములగుండా గవి గంగాధరేశ్వరుని అభిషేకం చేస్తాయని ఆ సమయంలో జనాలు చూడటానికి అనువుగా తెర ఏర్పాటు చేసి లైవ్ లో చూపిస్తారు అని తెలిసింది. ఆలయం నుండి బయటకు వస్తుంటే, మారుతి, సుబ్రహ్మన్యుడి, నవగ్రహ వుపాలయాలు దర్శించుకోవచ్చు. బయట మండపం లో సూర్యపాన చంద్రపాన (ఒక పెద్ద రాతి స్తంభం పైన ఒక వృత్తం లాంటి ఏర్పాటు, సూర్య, చంద్రులకు ప్రతీకగా చెబుతారు), ఒక త్రిశూలం కనిపిస్తాయి. ఇవన్నీ చూసుకుని ఆలయానికి ఒక ప్రదక్షిణ చేసుకున్న తరువాత, ప్రాగణం లోనే ఒక ట్రస్ట్ లాంటిది కనపడింది. లోపల, రాధా కృష్ణుల విగ్రహాలతో పాటు, పార్వతి పరమేశ్వరులు, సీత సమేత రామచంద్ర ప్రభువు లక్ష్మణ స్వామితో పాటు హనుమాన్ కనపడ్డారు. అక్కడ పక్కనే పూజ జరుగుతుంది. అక్కడ లోపల అన్న ప్రసాదాలు చేస్తున్నారు అని వెళ్ళమంటే, వెళ్లి ఉప్మా పెడుతుంటే స్వీకరించి తోచిన మొత్తం విరాళంగా ఇస్తుంటే, ప్రత్యేకించి విరాళం ఏమి లేదు తోచినంత అక్కడ పూజ దగ్గర పెట్టమన్నారు.

    ఈరోజుకి భగవంతుని దయతో దర్శనం బాగా జరిగింది అని భగవంతుని విభూతులు స్మరించుకుంటూ ఇంటిబాట పట్టాము.

     గవి గంగాధరేశ్వరుని ఆలయ దర్శనానికి వెళ్ళేవారు, వచ్చేముందు అక్కడకి దగ్గరలో వున్న బసవన్న గుడి లేదా బుల్ టెంపుల్ అంటారు. దొడ్డ బసవన్న, దొడ్డ గణపతి అని పెద్ద నంది, గణపతి ఆలయాలు బెంగళూరు ఫేమస్ చూసి రండి. 

మరిన్ని ఆలయ విశేషాలకు ఈ క్రింది లంకె లను చూడగలరు.