బెంగలూరు బి.టి.యం. మైకో లేఔట్ పరిధిలో వున్న సాయి బాబా ఆలయం భక్తులను విశేషంగా ఆకట్టుకుంటుంది. స్నేహితుడితో కలిసి మొన్నా మధ్య ఈ ఆలయ దర్శనం చేసుకున్నాను. ఆ విశేషాలు గురించే ఈ పోస్ట్.
బి.టి.యం. మైకో లేఔట్ బస్సు స్టాప్ దగ్గర పార్వతి పరమేశ్వర ఆలయం వుంది. దాని ప్రక్కగా ఒక సందులోంచి లోనికి వెళ్లి, ఎడమ ప్రక్కగా సందులో సాయి బాబా ఆలయం వుంది. ఆలయం ఎదురుగా వున్న పార్క్ వల్ల చాలా ప్రశాంతమైన వాతావరణంలో దైవ దర్శనం జరుగుతుంది. ఈ ఆవరణలోనే దత్తాత్రేయుల వారి ఆలయం కూడా వుంది. ధ్యాన మందిరం, ధుని, నందా దీపం, పుస్తక విక్రయశాల, సాయి బాబా వారి పాద ముద్రలతో కూడిన స్థూపం ఆలయ ఆవరణలో కనిపిస్తాయి.
మేము ఎప్పుడు వెళ్ళినా చాలా ప్రశాంతమైన అనుభూతికి గురి అవుతూ ఆశ్చర్య పడుతుంటాము. అస్సలు ఆలయంలోకి వెళ్ళే ముందు మన మనః పరిస్థితి ఎలా ఉండాలో అలా వుంటుంది ఇక్కడకు వచ్చినప్పుడల్లా . మొన్నసారి వెళ్లినప్పుడు పూలు కొందామని ఒక్కోరిని చూసుకుంటూ టెంపుల్ పాదాలు దగ్గర అన్నట్టు గేటు దగ్గర ఒకావిడ దగ్గర తీసుకున్నాము. లోపల 'క్యూ' లో దర్శనం చేసుకుని నందా దీపం దగ్గర నేను, మా స్నేహితుడి కోసం నిరీక్షిస్తుంటే కాసేపటికి వచ్చాడు. ఆలస్యం ఏమిటి అని అడిగితే, అభిషేకం ఇప్పుడే అయినట్టు వుంది 'మన' దండ తీసుకుని స్వామి మెళ్ళో వేసారు అని చెప్పాడు. అంతే ఇక చెప్పేదేముంది తెలిసిందే కదా ! :).
ప్రఖ్యాతి వహించిన ఆలయాలు గురించే రాద్దమనుకుంటాను కాని భగవంతుడు ఇలాంటి అనుభవాలను ఇచ్చి ప్రేరేపిస్తే, ఇంక ఏం చేస్తాము తప్పటం లేదు. ఇలాంటిదే మీకో అనుభవం చెప్పాలి. ఒకసారి మారుతీ నగర్ లో అమ్మవారి ఆలయం ఒకటి వుంది. కాస్త నివాస ప్రాంతాల మధ్య వుండటం వల్లనో, ఎందుకో నాకు అంత పక్కా వాస్తు ప్రకారం కట్టినట్లు అనిపించదు. అస్సలు గుడి నీడ ఇంటి మీద పడకూడదు అంటారు. ఈ కారణం వల్ల కూడా అంత సకారనాత్మక అదే పాజిటివ్ అభిప్రాయంలో వచ్చేది కాదు. ఇలా ఆలోచన వచ్చిన తరువాత ఒక రెండు రోజుల తరువాత ఆ ఏరియా అంతా లైటింగ్ తో బాగా హడావిడిగా వుంది. చూస్తె ఎం.ఎల్.ఏ. స్వాగత హోర్డింగ్స్ ఉత్సవాల ఏర్పాట్లు వివరాలు కనపడుతున్నాయి. స్నేహితుడిని అడిగితే ఎం.ఎల్.ఏ. తో పాటు ముఖ్యమంత్రి కూడా వచ్చి పోయాడు అని చెప్పాడు ???
నందాదీపం, ధుని దర్శించుకుని, దత్తాత్రేయ వుపాలయంలో దత్తాత్రేయునితో వేంచేసిన వినాయక స్వామి కూడా దర్శించుకున్నాము. పుట్టిన రోజు అని, మరో విశేషం అని ఇక్కడ తరచుగా భక్తులు ఏవో ఒక ప్రసాదాలు బాబాకి సమర్పించి భక్తులకు పంచుతుంటుంటారు. ఆరోజు కూడా అలా పంచుతుంటే ప్రసాదం స్వీకరించి బయలుదేరి వచ్చేసాము. మిగతా ఆలయాలలో వలే కాక, ఇక్కడ అంతరాలయంలో ఫోటో తీసుకోవచ్చు. కొన్ని ఫోటోలు తీసాము. చూడండి.
ఫేస్బుక్ లింక్ ఒకటి వుంది ఇది కూడా చూడండి.