Friday, October 27, 2017

'మా' కావేరి పుష్కరాల యాత్ర


కృష్ణభగవానుడు, అర్జునుడికి భగవత్ విభూతులు గురించి చెబుతూ సముద్రంలో వున్న ఇసుకరేణువులు లెక్కించగలవేమో గాని భగవంతుని విభూతులను లెక్కించలేము అని చెబుతాడు. యోగులు మనకి చూపించే 'మహిమలు' అప్రకటింగా వ్యక్తమయ్యే భగవంతుని విభూతులే మరి. అంతేకాని వారు సంకల్పించి వారి గొప్పతనం కోసం చేసేవి కావు. ఇంతకు ముందొకసారి వేరే పోస్టులో ఇవే  విషయాలు చెప్పారు కదా సర్ ! అనకండి. ఎందుకో తరువాత చెబుతాను.

సరే విషయానికి వస్తే -  గోదావరి పుష్కరాలు అయ్యాయి, కృష్ణ పుష్కరాలు కూడా అయ్యాయి. ఇదిగో చటుక్కున కావేరి పుష్కరాలు కూడా వచ్చేసాయి. 'గురు'వు గారు చాలా వేగం సుమండీ. ప్రతి సంవత్సరానికి ఒక్కో రాశి చుట్టేస్తారు (గురువు గారు ప్రతి సంవత్సరం ఒక్కోరాశిలోకి వస్తారు. అప్పుడు ఒక్కో ముఖ్య నదికి పుష్కరాలు వస్తాయి అని మనకి తెలుసు కదా ! ౨౦౧౮ కి భీమా నదికి వస్తాయి).

బెంగళూరులో అద్దె బైకులు, కార్లకు కొదవలేదు. అలా తీసుకుని నంది హిల్స్ కి మీ ప్రియతమవారితో ఆహ్లాదంగా వెళ్లి గడపవచ్చు లేకుంటే అదే 'నంది' హిల్స్  మీద ఉషోదయ కిరణాలలో తన్మయత్వంతో ఆదిత్య  హృదయాన్ని హృదయంతో మీటి ఆదిత్యున్ని సేవించ్చవచ్చును కూడా. ఏదైనా అది మన డొక్క శుద్ధికి సంబందించిన విషయం.

సరే 'స్ట్రెయిట్'గా విషయానికి వస్తున్నా. తెలిసిన బందువు ఒకరు కొద్ది రోజుల నుంచి 'ఎనీ టైం' అన్నట్టు భగవంతుని పిలుపు కోసం ఎదురు చూస్తున్నారు. ఈ సారి పుష్కరాలు ఏమవుతాయో అన్న ఒత్తిడిలో నాతో సహా బంధువులందరం వున్నాము.

ఈ ఆందోళనతోనే స్నేహితుడి దగ్గర వున్న అవెంజర్ బైక్ తో పాటు ఒక రాయల్ యెన్ఫీల్డ్ అద్దెకు తీసుకుని నలుగురు స్నేహితులం 'సంగమ' ప్రాంతం దగ్గరకు బయలుదేరాము.

కనకపురా రోడ్ లో వున్న "సంగమ" బెంగళూరుకి ౬౦ కిలోమీటర్లు దూరంలో వుంది అర్కావతి నది ఇక్కడ కావేరిలో కలిసి కావేరిగా మారిపోతుంది. మేము వెళ్లేసరికి నడుంలోతు నీళ్లు వున్నాయి ఇక్కడ. పుట్టీలు అంటారు కదా చిన్న చిన్న గుండ్రంగా పడవలులాగ ఉంటాయి. వాటిమీద నదికి ఈ ఒడ్డు నుంచి ఆ ఒడ్డుకి దాటిస్తారు. జస్ట్ ఒక ఫర్లాంగు దూరం అంతే. అక్కడ స్నానాదులు ముగించుకున్నాము. 'మేకెదతు' అని ఫాల్స్ వున్నాయి అంట. ఆ ఒడ్డు నుంచి అడవి ప్రాంతం ప్రారంభం అవుతుంది. మన వెహికల్స్  అనుమతించరు. ఫారెస్ట్ వాళ్ళ  ద్వారా ప్రైవేట్ వెహికల్స్ లో అడవిలోకి తీసుకెళతారు.  ఆరోజు వున్నా రెండు వెహికల్స్  రిపేర్ లో వున్నాయి. ఇంక వెళ్ళటం కుదరలేదు. నది అటుపక్క  ఒడ్డున  ఫోన్ సిగ్నల్స్  రావటం లేదు. చాలా కష్టపడితే వస్తున్నాయి. ఇంతా చేసి నెట్లో వున్న పుష్కర స్నాన శ్లోకం కోసం నా బాధ అంతా. మా అన్నని, స్నేహితుడిని పట్టుకుని మొత్తానికి శ్లోకం విని చిటికెడు ఇసుక నదిలో వేసుకుని మా పుణ్యాన్ని 'కృత్య' బారి నుంచి కాపాడుకున్నాము. అర్థం కాలేదా ? ఇక్కడ చదవండి.
(పనిలో పని పుష్కర శ్లోకం కూడా వుంది దాచుకోండి మరి).

నదీస్నానం ముగించుకుని వస్తుంటే ఇక్కడొక  చిన్న శివాలయం కూడా కనిపించింది. 'సంగమ' పేరుకు తగ్గట్లే స్వామి ఇక్కడ సంగమేశ్వర స్వామి రూపంలో పూజలు అందుకుంటున్నాడు. అక్కడ దర్శనం, పూజ పూర్తి చేసుకుని బయలుదేరి వస్తుంటే అప్పుడు సిగ్నల్ వస్తుంది. మెసేజెస్ వస్తున్నాయి. మా అన్న మిస్డ్ కాల్స్  నోటిఫికేషన్ చూసి కాల్ చేశాను. మా అన్న ఎక్కడ వున్నావు అని విచారణ చెయ్యగానే మొదట అడిగిన ప్రశ్న అయ్యిపోయాడా ఏంటి అని. మా అన్న అవునంటూనే నువ్వు  ఘాట్ దగ్గర రెండోసారి ఫోన్ చేసినప్పుడు డాడ్ అప్పుడే ఫోన్ చేశారు విషయం చెబుతూ వున్నారు అని. అప్పటికే మన స్నానం అయిపొయింది. మా వాళ్ళకి శ్లోకంతో అప్పటికే పూర్తి చేసానో, చేపించేసానో గానీ, మొత్తానికి అవన్నీ గుర్తుకువచ్చాయి. ఫీజులు ఎగిరిపోయాయి విషయం విన్నాక. మొత్తం ప్రోగ్రాం పాడవటమేకాదు వ్యయప్రయాసలు వ్యర్ధమైపోయేవే. తృటిలో తప్పిపోయింది గండం.

మన కర్మవశావస్తూ పీకల్లోతు మునిగిపోనీ, జుట్టు పట్టుకుని మరీ పైకి లేపుతాడు భగవంతుడు. మన ప్రారబ్దం, ఆయన అనుగ్రహం రెండూ మనకి అలవాటే కదా :). మరి మీకు ?

వచ్చేదారిలో శివణాంకారేశ్వర ఆలయం వుంది. రోడ్ బాలేదు జాగ్రర్తగా వెళ్ళాలి. వివరాలు ఇక్కడ చూడండి.

మేము వెళ్లేసరికి ఆలయం మూసివేసి వున్నది. కొంచెం నీళ్లు తాగి తిరుగు ప్రయాణం అయ్యాము. వచ్చేదారిలో చుంచి హిల్స్  బావుంటాయి అంటే అవి కూడా మళ్ళీ వెనక్కి వెళ్లి పైపైన చూసి వచ్చాము. అప్పటికే బాగా అలిసిపోయాము. జలపాతం కూడా పెద్దగాలేదు. వర్షాకాలంలోనే చూడాలి అవి.  వచ్చేదారిలో  ఒక హోటల్లో భోజనం చేసి బెంగళూరుకు వచ్చేసాము. మొత్తానికి అలా జరిగింది మా కావేరి యాత్ర. వుంటాను.






















No comments:

Post a Comment