ఇప్పుడు మనం చెప్పుకోబోయేది చోళుల కాలం నాటి సోమేశ్వరుని ఆలయమ్. పరమశివుడు స్వయంభూగా సోమేశ్వరునిగా, మహిమల దేవుడిగా ఇక్కడ పూజలు అందుకుంటున్నాడు. ఈ ఆలయం చాలా పురాతనమైనదిగా చరిత్ర చెబుతున్నది. వికీ ప్రకారం ఇది చోలులకాలం 12 వ శతాబ్దం (1247 AD) ముందిదిగా కనిపిస్తుంది. సుమారు తొమ్మిది తరాలు ఒకే కుటుబం నుంచి స్వామి అర్చకులుగా పని చేస్తున్నారు అని మా స్నేహితుడు తెలిపాడు. తనూ, తన స్నేహితుడు ఉద్యోగ జీవనం లో ఎదుర్కొన్న ఇబ్బందులు స్వామి చేసిన లీలలు తను చెప్తుంటే నమ్మి నిలిచి ఒక అడుగు భగవంతుడు కోసం వేస్తె ఆయన మనకోసం ఎన్ని అడుగులో వేస్తాడో అనిపించింది. మరి మీరు ప్రయత్నిస్తారా ఒకసారి ).
అర్చనకు 5 రూపాయల టికెట్ వుంది. అభిషేకాలు పూజలు అన్ని మామూలు గానే జరుగుతాయి. కార్తీక మాసం లో పర్వదినాలలో దీపాల వెలుగులో దేవాలయం వెలిగిపోతూ వుంటుంది. దీపాల శోభలో కార్తీక పౌర్ణమి రోజు చూడాలి ఆ సోయగం.
వినాయక స్వామి, ప్రథమ గణపతి, దక్షిణ మూర్తి, శ్రీనివాస స్వామి, సుబ్రహ్మనఎస్వర స్వామి, బ్రహ్మ, పార్వతి దేవి, అన్నపూర్ణేశ్వరి దేవి, ఆంజనేయ స్వామి, కాల భైరవ స్వామి, సూర్య భగవానులను అంతరాలయం లో ఇక్కడ చూడవచ్చు. అక్కడే యుపలాలుగా నవగ్రహాలు, అయ్యప్ప స్వామి దర్శనమిస్తారు.
చేరుకోవటం ఎలా
BTM దగ్గర భారతి AXA బిల్డింగ్ బస్సు స్టాప్ నుంచి రెండు నిమిషాలు సిల్క్ బోర్డు వైపు నడిస్తే ఎడం పక్కగా పవన్ హోటల్ వస్తుంది. ఆక్కడ ఎడం పక్క సందు లోకి ప్రవేశించి సందు చివరకు చేరుకోవాలి. అక్కడ కుడివైపుకు తిరిగి ఒక నిమిషం నడిస్తే మరియమ్మ ఆలయం వస్తుంది ఆక్కడ నుంచి ఒక నిమిషం ఎడం వైపుగా నడిస్తే సోమేశ్వర ఆలయం కనిపిస్తుంది.
మరో మార్గం ఏమిటి అంటే, BTM దగ్గర భారతి AXA బిల్డింగ్ వెనకవైపుకు చేరుకొని సిల్క్ బోర్డు వైపుకు సందు లో నడుస్తుంటే మనకు మరియమ్మ ఆలయం, సోమేశ్వర ఆలయాలు వరసగా కనిపిస్తాయి. అక్కడ ఎవరిని అడిగిన దారి చెప్తారు.
కార్తీక పున్నమి నాడు చూడాలి స్వామి వైభవం