పరమ ప్రశాంతమైన వాతావరణం, చుట్టూ అందమైన కొండలు, లేలేత పచ్చిక బయళ్ళు, కాలుష్య కోరలు పడని నేలలు, మంద్రంగా వీచే గాలి పాటలు, వీటన్నిటికి మించిన వేంకటేశుని అందం !!! ఓహ్ ! చూడాలంటె పూణే శివార్లలో వున్న నారాయణ పూర్ వెళ్ళాల్సిందే.
శిరిడి యాత్ర ముగించుకున్న తరువాత పూణే లో వున్న స్నేహితుడిని చూడడానికి వెళ్లాను. తనతో పాటు నారాయణ ధామ్ చూడాలని బైక్ మీద మగరపట్ట నుండి ప్రయాణం మొదలెట్టాము. ఇది పూణే కి సుమారు 40-50 కిలోమీటర్స్ వస్తుంది. ఇది శివార్లలో చిన్న చిన్న పల్లెలు దాటుకుంటూ వెళుతుంది కాబట్టి ప్రయాణం చాలా ఆహ్లాదకరంగా సాగింది. వెళ్ళేదారిలో కొండలను చుట్టుముట్టిన మంచుతెరల మీద వెళుతున్నపుడు ఓహ్! అది వర్ణించవీలుకానిది. వెళ్ళేదారిలో పురాతన ఆలయం కనిపించింది కానీ వెళ్ళలేదు. ఎగుడు దిగుడు కొండలలో మలుపులు తిరుగుతూ ప్రయాణం చాలా బాగా సాగింది. దీనికి తోడూ సన్నపాటి వర్షం వల్ల అందం ద్విగునీకృతమైనదనిపించింది.
ఆలయ ఆవరణం లో ప్రవేశించగానే తెలుగు భక్తి గీతాలు విని ఆశ్చర్య పోయాను. ఇది తెలుగు వాళ్ళు కట్టించారు అని సుమారు 200 కోట్లు ఖర్చు ఐంది అని తెలుసుకున్నాక ఇంకా ఆశ్చర్యం వేసింది. పరిశుభ్రతకు, ప్రశాంతతకు, మరియు క్రమశిక్షణనకు మారు పేరులా వుంది. అన్నిటికి మించి భగవంతునికి దగ్గరగా వచ్చినట్టు వుంది. వేంకటేశ్వరుని దర్శనం చేసుకున్నప్పుడు ఆ అందం గురించి యెంత చెప్పినా తక్కువే అనిపించింది. పెద్ద తిరుపతి లో ఎలా ఐతే పూజాది కార్యక్రమాలు జరుగుతాయో అన్ని అలానే జరుగుతాయి అని పూజారులు చెప్పారు. వారు తెలుగు వారేనని తిరుపతి గుడిలో పని చేసారని ఆ రోజు బ్రహ్మోత్సవాలు మొదటి రోజు అని చెప్పారు. మాకు కొంత ఆశ్చర్యం కొంత ఆనందం వేసాయి. పర్వదినాలు మనం గుర్తుపెట్టుకున్నమ లేదా అని కాక భగవంతుడు మనకు గుర్తుచేసేలాగా మన అంతరిక భక్తీ, సాన్నిహిత్యం వుండడం ముఖ్యం అనిపించింది :). దేవాలయం ఆలయ దర్శనం పూర్తిగా ఉచితం. చాలా అతి కొద్ది దెవాలయలలో మాత్రమే మనం ఇది చూస్తాము అనుకుంటా. ఉపాలయాలు అన్ని దర్శించుకున్నాము. దశావతారముల కథాక్రమం తో దేవాలయం పై చెక్కిన ప్రతిమలు బావున్నాయి. దేవాలయం లో అందరికి లడ్డు ఉచిత ప్రసాదంగా ఇచ్చారు. దేవాలయ అన్నదానం సత్రం కి వెళ్ళాము. నిర్వహణ చాలా బావుంది. ఎంత తిన్నా పెడతారు కాని కొద్ది కొద్దిగ పలు దఫాలుగా పెడతారు. అనవసరంగా వృథా చెయ్యకూడదు అన్న వాళ్ళ సంకల్పం నచ్చింది. ముఖ్యం గా అన్నదాన సత్రాలు పరిశుబ్రంగా నిర్వహించటం చాలా కష్టం అనుకుంటున్నా. దేవాలయ దర్శనం ముగించుకుని బయటకు వచ్చిన వెంటనే పరిసరాలలో సీతాపలాలు కనిపించాయి. సీజన్లో లో మొదటి సారిగా మొదటిది తిన్నానేమో అత్యద్భుతం గా వుంది. ఇక పరిసరాలు చూసుకుంటూ తిరుగు ప్రయాణం ఐయ్యాము.

No comments:
Post a Comment