Sunday, November 30, 2014

సూర్య నారాయణ్ ఆలయం, దొమ్ములూర్, బెంగుళూరు

















ఈరోజు ఆదివారం. ఎప్పటినుండో సూర్యనారాయణ ఆలయ దర్శనం చేసుకోవాలి అనుకున్నప్పటికీ వీలుకావటం లేదు. నిన్న రాత్రి మరొక ఇద్దరు స్నేహితులతో చర్చించి ఈరోజు ఉదయం దర్శించుకోవాలి అని భావించాము. అనుకున్నట్లుగానే ఉదయం ఒక ఆటో పట్టుకుని (కపర్దీ" అని ముమ్మారు స్మరణ చేసుకొని (పాత పాపాలు, కర్మలు అడ్డుపడకుండా)) దొమ్ములూర్, పాత ఎయిర్ పోర్ట్ రోడ్ ప్రాంతంలో వున్న సూర్య నారాయణ ఆలయంకి చేరుకున్నాము. భక్తుల తాకిడి బానే వుంది. గుడి పక్కనే సూర్య నారాయణ స్వామి ఆలయం వారి కళ్యాణ మండపం వుంది.

ఆలయ విశేషాలకొస్తే, సూర్యనారాయణ స్వామి వారి ఆలయం శ్రీ పటేల్ డి. ఆర్. కృష్ణా రెడ్డి అనే అయన చోళ నిర్మాణ శైలిలో 1995 సంవత్సరంలో నిర్మించినట్లుగా, సిద్ధ గంగా పీఠాధిపతులు శ్రీ శ్రీ శ్రీ శివ కుమార్ స్వామిజీ చేతుల మీదుగా ప్రారంభించినట్లు తెలియవస్తుంది.

సూర్యనారాయణ స్వామికి ప్రధాన దైవంగా ఆలయాలు చాలా అరుదు. కేవలం వుపాలయాలే కాని ప్రత్యేకించి ఒక ఆలయంని నిర్మించటం అన్నది కేవలం సుర్య భగవానుని సంకల్పం, ఆశీర్వాదమే కానీ మరొకటి కాదు అనిపిస్తుంది. ఇలాంటి విషయంలో దాతల వితరణ కూడా కాస్త కష్ట సాధ్యమే. ఆదరణ వున్న దేవతలకే కాని మిగిలిన దేవతల విషయంలో గుడి నిర్మాణం వంటివి చాల కష్టసాధ్యమని దైర్యం చేసి అంటున్నాను (క్షమించ ప్రార్ధన).     

కోణార్క్ సూర్య దేవాలయం, అరసవల్లి లేదా హర్షవల్లి సూర్య దేవాలయం వంటి ఆలయాలు దర్శనం చేసుకోలేని వారు, ఆయా ఆలయాల దర్శన ప్రాప్తికి మార్గం సుగమం చేసుకోవాలి అనుకునే వారు తప్పక దర్శించుకోవాలిసిన ఆలయం ఈ సూర్యనారాయణ స్వామి ఆలయం.   

సూర్య నారాయణ స్వామి ఆలయంలో అనేక వుపాలయాలు వున్నాయి. శివుడితో పాటు, శనైశ్చరుడికి, వైష్ణవి మాతకి, నవ గ్రహాలకు, ఇతర దేవతలకు వుపాలయాలు వున్నాయి.

ఆలయం అత్యంత పరిశుభ్రంగా నిర్వహిస్తున్నారు. ఎటువంటి గందరగోళాలు లేకుండా చాల ప్రశాంతంగా వుంది. ప్రసాదం కూడా చాలా బావుంది. నాకు పూణే - నారాయణపూర్  దగ్గర వున్న బాలాజీ ఆలయం గుర్తుకు వచ్చింది. ఎంతో అంకితభావం ఉంటేనే కాని ఇలా సాధ్యం కాదు.

సూర్య రధం 32 అడుగులతో సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే అదీ రథసప్తమి రోజు వందలాది భక్తులతో లాగబడుతుంది అని తెలియవచ్చింది.

దర్శనం కొంచెం సమయం తీసుకున్న ప్రతీవారి పేరునా అర్చన చేసారు. ఎటువంటి టికెట్ లేకపోవటం గమనార్హం :). వేడి వేడి ప్రసాదాలు స్వీకరించి ఆలయం నుంచి బయలు దేరి వచ్చేసాము.

కొసమెరుపు ఏమిటంటే, మేము ఎక్కిన ఆటో స్వామి అయ్యప్ప దీక్షలో వుండటం. మాతోపాటే దర్శనం కి వచ్చి, మాతోపాటే తిరిగివేనక్కి రావటం. దీన్నే స్వామి కార్యం స్వకార్యం అంటారేమో :). 


Useful Links :

http://suryatemple.org/index_1.htm
http://www.bengaloorutourism.com/surya-narayana-temple.php

ఆలయ వేళలు:
సోమ-శని 8:00-12:00 & 5:00-8.30
ఆదివారం 6:00-1:00 & 5:00-8:30 

ఆలయ చిరునామా:
శ్రీ సూర్య నారాయణ ఆలయం,
కే. ఆర్. కాలని,
దొమ్లూర్ లేఅవుట్ (ఓల్డ్ ఎయిర్ పోర్ట్ రోడ్)
బెంగుళూరు, కర్ణాటక.
ఫోన్: +91-80-25350386
మెయిలు: info@suryatemple.org

No comments:

Post a Comment