మరాఠ రాజు శివాజీ సోదరుడు వెంకోజి 17 వ శతాబ్దంలో, అశ్వత వృక్షాల నడుమ, ఒక పెద్ద రాతి మీద కాడు మల్లిఖర్జున స్వామి ఆలయాన్ని నిర్మించినట్టుగా చెబుతారు. అస్సలు ఈ ఏరియా పేరు (మల్లేశ్వరం) కూడా ఈ స్వామి పేరుమీదనే వచ్చినట్టు చెబుతారు. గత వారం రోజుల నుండి త్రిచి వెళ్ళాలి అనీ, శివన సముద్రం వెళ్ళాలి అనీ, ఇంకా చాల ఆలోచనలు చేసాము కాని. రకరకాల కారణాలు - రైలు టికెట్లు దొరకకపోవటం చేతనూ, ఇతర చిన్న చిన్న పనుల చేతనూ అన్యమనస్కంగా వున్నాము. సరేలెమ్మని మళ్లేశ్వరం దగ్గరవున్న శ్రీ నందికేశ్వర ఆలయం కి వెళ్ళాలి అని శుక్రవారం అనుకున్నాము ఈరోజు శనివారం బయలుదేరాము. ఐతే దురదృష్టవశాత్తు (?) ఆలయం 10 గంటల కల్లా మూసివేస్తారని తెలిసింది. మేము 10 గంటలకే వెళ్ళాము. లోపల వున్నా కొద్ది భక్తులకు మాత్రం బయటకు రావటానికి ఆలయం గేటు తెరుస్తున్నారు. ఇంత తొందరగా మూసి వెయ్యటం ఎక్కడ చూడకపోవటంతో కూడిన ఆశ్చర్యం, దర్శనం కాలేదని కొద్ది బాధ కలిగింది.
ఇంక ఈ నందికేశ్వర ఆలయం 1999లో బయటపడినట్టు గా చెబుతారు.కార్బన్ డేటింగ్ ప్రక్రియలో ఈ ఆలయం 7, 000 సంవత్సరాల పురాతనంగా తేలటం ఆశ్చర్యం గొలిపే విషయం ఐతే ఇంత రద్ధీ ప్రాంతంలో కూడా ఇన్ని సంవత్సరాల నుంచి బయలుపడకుండా వుండడం మరింత ఆశ్చర్యపడే విషయం.
నందికేశ్వర ఆలయంలో నంది నోటినుండి వెలువడే నీరు శివ స్వామిని అభిషేకం చేస్తుంది. అస్సలు ఈ నీరు ఇక్కడ నిరంతరాయంగా అభిషేకిస్తూనే వుంటుంది. ఈ నీరు యొక్క మూలం ఎక్కడో, ఎవరికీ తెలియడం లేదు. వృషభావతి నది మూలం పుట్టుక ఇక్కడే అని చెబుతారు.
కాడు మల్లిఖార్జున ఆలయంలో, కుమారస్వామి ఆలయం కూడా వుంది. పెద్ద ఆలయ సమూహంలా లక్ష్మీనరసింహ ఆలయం, గంగమ్మ ఆలయంతో పాటు ఇక్కడ 4 పెద్ద ఆలయాలు వున్నాయి. అనేక అంతరాయాలు, వుపాలయాలు వున్నాయి. పార్వతి, వినాయక, శక్తి గణపతి, విష్ణు, చందికేశ్వర, ఆంజనేయ, నవగ్రహ, నాగ ప్రతిమలూ, వుపాలయాలు అంతటా పూజలు అందుకుంటున్నాయి.
ఈరోజు శని త్రయోదశి కావటం చేత దేవాలయం పరిసరంలో నూనె బట్టని దీపంలో వేసి, అర్చనతో దర్శనం చేసుకున్నాము.
ముఖ్య గమనిక:
పదిగంటల లోపు దర్శనం చేసుకోవాలి అన్ని ఆలయాలు ఇక్కడ. దాదాపు నాలుగు ఆలయాలు ఇక్కడ వుంటే కేవలం కాడు మల్లిఖార్జున స్వామి ఆలయం మాత్రం 12 వరకు వుంటుంది. మిగతావి అన్ని 10 గంటల కల్లా మూసివేస్తారు. మళ్ళీ సాయంత్రమే 5 గంటలకు.
పక్కనే వెంకటేశ్వర భవన్లో ఉపాహారం స్వీకరించాము. అద్భుతంగా వుంది. ఆలయం వాళ్ళు నిర్వహిస్తే ఎలా వుంటుందో అలా వుంది :).
కొసమెరుపు చెప్పలేదు కదా ! అర్చన జరిగేటప్పుడు ద్వజస్తంబం వరకూ భక్తులు నిలుచున్నారు. మేము ద్వజస్తంబం పక్కనే వున్నాము. అలా మల్లిఖార్జునుడిని స్మరిస్తూ భక్తిభావం లోకి వెళుతుంటే ఆకస్మాత్తుగా ఎక్కడ నుండి వచ్చిందో తెలియదు కాని ఒక సీతాకోక చిలుక మా పైన తిరుగుతూ ప్రదక్షిణగా ఆలయంలోకి వెళ్ళీ వెళ్ళనట్టు ఒక ప్రదక్షిణ చేసింది. అది ఎలా వచ్చినట్టు అలా వెళ్ళిపోయింది...........! భక్తులు ఇంకా అలా చూస్తున్నారు. మనకి కొత్త ఏమిటండి అలవాటే కదా ! ఎన్ని చూసాము ఆయన విభూతులు :).
Useful links & sources:
---------------------------
http://www.bangalorebest.com/discoverbangalore/sightseeing/religion/temples/Mallikarjunaswamy.php
http://timesofindia.indiatimes.com/bangalore-times/7000-year-old-temple-in-Malleswaram/articleshow/129602326.cms
http://www.newindianexpress.com/cities/bengaluru/article1472267.ece
No comments:
Post a Comment