Monday, November 18, 2013

సోమేశ్వర ఆలయమ్, పాత మడివాల, బెంగళూరు


     ఇప్పుడు మనం చెప్పుకోబోయేది  చోళుల కాలం నాటి సోమేశ్వరుని ఆలయమ్. పరమశివుడు స్వయంభూగా సోమేశ్వరునిగా, మహిమల దేవుడిగా ఇక్కడ పూజలు అందుకుంటున్నాడు. ఈ ఆలయం చాలా పురాతనమైనదిగా చరిత్ర చెబుతున్నది. వికీ ప్రకారం ఇది చోలులకాలం 12 వ శతాబ్దం (1247 AD) ముందిదిగా కనిపిస్తుంది. సుమారు తొమ్మిది తరాలు ఒకే కుటుబం నుంచి స్వామి అర్చకులుగా పని చేస్తున్నారు అని మా స్నేహితుడు తెలిపాడు. తనూ, తన స్నేహితుడు ఉద్యోగ జీవనం లో ఎదుర్కొన్న ఇబ్బందులు స్వామి చేసిన లీలలు తను చెప్తుంటే నమ్మి నిలిచి ఒక అడుగు భగవంతుడు కోసం వేస్తె ఆయన మనకోసం ఎన్ని అడుగులో వేస్తాడో అనిపించింది. మరి మీరు ప్రయత్నిస్తారా ఒకసారి ).   

అర్చనకు 5 రూపాయల టికెట్ వుంది. అభిషేకాలు పూజలు అన్ని మామూలు గానే జరుగుతాయి. కార్తీక మాసం లో పర్వదినాలలో దీపాల వెలుగులో దేవాలయం వెలిగిపోతూ వుంటుంది. దీపాల శోభలో కార్తీక పౌర్ణమి రోజు చూడాలి ఆ సోయగం.

వినాయక స్వామి, ప్రథమ గణపతి, దక్షిణ మూర్తి, శ్రీనివాస స్వామి, సుబ్రహ్మనఎస్వర స్వామి, బ్రహ్మ, పార్వతి దేవి, అన్నపూర్ణేశ్వరి దేవి, ఆంజనేయ స్వామి, కాల భైరవ స్వామి, సూర్య భగవానులను అంతరాలయం లో ఇక్కడ చూడవచ్చు. అక్కడే యుపలాలుగా నవగ్రహాలు, అయ్యప్ప స్వామి దర్శనమిస్తారు.

చేరుకోవటం ఎలా

BTM దగ్గర భారతి AXA బిల్డింగ్ బస్సు స్టాప్ నుంచి రెండు నిమిషాలు సిల్క్ బోర్డు వైపు నడిస్తే ఎడం పక్కగా పవన్ హోటల్ వస్తుంది. ఆక్కడ ఎడం పక్క సందు లోకి ప్రవేశించి సందు చివరకు చేరుకోవాలి.  అక్కడ కుడివైపుకు తిరిగి ఒక నిమిషం నడిస్తే మరియమ్మ ఆలయం వస్తుంది ఆక్కడ నుంచి ఒక నిమిషం ఎడం వైపుగా నడిస్తే సోమేశ్వర ఆలయం కనిపిస్తుంది.

మరో మార్గం ఏమిటి అంటే, BTM దగ్గర భారతి AXA బిల్డింగ్ వెనకవైపుకు చేరుకొని సిల్క్ బోర్డు వైపుకు సందు లో నడుస్తుంటే మనకు మరియమ్మ ఆలయం, సోమేశ్వర ఆలయాలు వరసగా కనిపిస్తాయి. అక్కడ ఎవరిని అడిగిన దారి చెప్తారు.



       
కార్తీక పున్నమి నాడు చూడాలి స్వామి వైభవం



Saturday, November 2, 2013

నారాయణ ధామం, పూణే

పరమ ప్రశాంతమైన వాతావరణం, చుట్టూ అందమైన కొండలు, లేలేత పచ్చిక బయళ్ళు, కాలుష్య కోరలు పడని నేలలు, మంద్రంగా వీచే గాలి పాటలు,  వీటన్నిటికి మించిన వేంకటేశుని అందం !!! ఓహ్ ! చూడాలంటె పూణే శివార్లలో వున్న నారాయణ పూర్ వెళ్ళాల్సిందే.

శిరిడి యాత్ర ముగించుకున్న తరువాత పూణే లో వున్న స్నేహితుడిని చూడడానికి వెళ్లాను. తనతో పాటు నారాయణ ధామ్ చూడాలని బైక్ మీద మగరపట్ట నుండి ప్రయాణం మొదలెట్టాము. ఇది పూణే కి సుమారు 40-50 కిలోమీటర్స్ వస్తుంది. ఇది శివార్లలో చిన్న చిన్న పల్లెలు దాటుకుంటూ వెళుతుంది కాబట్టి ప్రయాణం చాలా ఆహ్లాదకరంగా సాగింది. వెళ్ళేదారిలో కొండలను చుట్టుముట్టిన మంచుతెరల మీద వెళుతున్నపుడు ఓహ్! అది వర్ణించవీలుకానిది. వెళ్ళేదారిలో పురాతన ఆలయం కనిపించింది కానీ వెళ్ళలేదు. ఎగుడు దిగుడు కొండలలో మలుపులు తిరుగుతూ ప్రయాణం చాలా బాగా సాగింది. దీనికి తోడూ సన్నపాటి వర్షం వల్ల అందం ద్విగునీకృతమైనదనిపించింది.

ఆలయ ఆవరణం లో ప్రవేశించగానే తెలుగు భక్తి గీతాలు విని ఆశ్చర్య పోయాను. ఇది తెలుగు వాళ్ళు కట్టించారు అని సుమారు 200 కోట్లు ఖర్చు ఐంది అని తెలుసుకున్నాక ఇంకా ఆశ్చర్యం వేసింది. పరిశుభ్రతకు, ప్రశాంతతకు, మరియు క్రమశిక్షణనకు మారు పేరులా వుంది. అన్నిటికి మించి భగవంతునికి దగ్గరగా వచ్చినట్టు వుంది. వేంకటేశ్వరుని దర్శనం చేసుకున్నప్పుడు ఆ అందం గురించి యెంత చెప్పినా తక్కువే అనిపించింది. పెద్ద తిరుపతి లో ఎలా ఐతే పూజాది కార్యక్రమాలు జరుగుతాయో అన్ని అలానే జరుగుతాయి అని పూజారులు చెప్పారు. వారు తెలుగు వారేనని తిరుపతి గుడిలో పని చేసారని ఆ రోజు బ్రహ్మోత్సవాలు మొదటి రోజు అని చెప్పారు. మాకు కొంత ఆశ్చర్యం కొంత ఆనందం వేసాయి. పర్వదినాలు మనం గుర్తుపెట్టుకున్నమ లేదా అని కాక భగవంతుడు మనకు గుర్తుచేసేలాగా మన అంతరిక భక్తీ, సాన్నిహిత్యం వుండడం ముఖ్యం అనిపించింది :). దేవాలయం ఆలయ దర్శనం పూర్తిగా ఉచితం. చాలా అతి కొద్ది దెవాలయలలో మాత్రమే మనం ఇది చూస్తాము అనుకుంటా. ఉపాలయాలు అన్ని దర్శించుకున్నాము. దశావతారముల కథాక్రమం తో దేవాలయం పై చెక్కిన ప్రతిమలు బావున్నాయి. దేవాలయం లో అందరికి లడ్డు ఉచిత ప్రసాదంగా  ఇచ్చారు. దేవాలయ అన్నదానం సత్రం కి వెళ్ళాము. నిర్వహణ చాలా బావుంది. ఎంత తిన్నా పెడతారు కాని కొద్ది కొద్దిగ పలు దఫాలుగా పెడతారు. అనవసరంగా వృథా చెయ్యకూడదు అన్న వాళ్ళ సంకల్పం నచ్చింది. ముఖ్యం గా అన్నదాన సత్రాలు పరిశుబ్రంగా నిర్వహించటం చాలా కష్టం అనుకుంటున్నా. దేవాలయ దర్శనం ముగించుకుని బయటకు వచ్చిన వెంటనే పరిసరాలలో సీతాపలాలు కనిపించాయి. సీజన్లో లో మొదటి సారిగా మొదటిది తిన్నానేమో అత్యద్భుతం గా వుంది. ఇక పరిసరాలు చూసుకుంటూ తిరుగు ప్రయాణం ఐయ్యాము.












ప్రసన్న వెంకటేశ్వర స్వామి, చిక్క తిరుపతి - మన వూరి దేవుడు.





   కొన్ని ఆలయాలు శక్తి వంతంగా వున్నా ఆదరణకు ఆమడ దూరంలో వుంటాయి. కొన్ని ఆలయాలు కాస్త అటు ఇటు గా వున్నా ఆదరణలో మాత్రం చాల ముందు వరసలో ఉంటాయి. అగ్ని ప్రతిష్టత చిక్క తిరుపతి వేంకటేశ్వరుని ఆలయం మొదటి కోవలోకి వచ్చేలాగ వుంది. చిన్నపుడు  దైవం, అందరు ఒకచోట భజానా కాలక్షేపం లాంటివి రాములవారి గుడిలో జరుగుతుండేవి. ఇపుడు సాయి బాబా ఆలయాలలో జరుగుతున్నాయి. ప్రదాన రహదారికి ఆనుకునే వున్న ఈ ఆలయమ్ బెంగుళూరుకి డెబ్బై కిలోమీటర్స్ వస్తుంది. బస్సు లో ఐతే మలూర్ కి యాభై కిలోమీటర్స్ అక్కడ నుండి సరాసరి గుడి కి 20 కిలోమీటర్స్ వస్తుంది. ఎలెక్ట్రానిక్ సిటీ మీదుగా బైక్ లో వెళ్ళితే నలబై కిలోమీటర్స్ లోపే అని స్నేహితుడు చెప్పాడు. ఎప్పటిలాగే మేజస్టిక్ బస్సు స్టాండ్ దగ్గర వున్న APSRTC బస్సు స్టాండ్ నుంచి మాలుర్ కి వెళ్లి అక్కడ నుండి చిక్క తిరుపతి బస్సు లో వెళ్ళాము. కోలార్ మీద నుంచి కూడా రూట్ వుంది అని తెలిసింది. ఇది కోలార్ జిల్లా లోకే వస్తుంది.  అక్కడ కోటి లింగాలను దర్శించి వచ్చేవాళ్ళు ఉండవచ్చు. ఆలయం దర్శనం కి మేము వెళ్ళే సరికి మధ్యానం అయిపోయింది. ఇక సాయత్రం దర్శనమే అనుకునే సమయానికి తెలిసిన విషయం ఏమిటి అంటే బ్రేక్ వుండదు, సాయత్రం వరకు ఆలయం తెరిచే వుంటుంది అని :). భగవంతుని అపార దయ అంటే ఇదే అని పించింది. పొద్దున్న నుంచి ఏమి తినలేదు జీవుడిని నిలబెట్టటానికి ఏదో కొద్దిగా ఆపదర్మంగా స్వీకరించాము. ఆలాంటి సమయం లో ఇలాంటి వార్త అంటే మీరే ఊహించుకోవండి :). దర్శనం చాల బాగా జరిగింది. భగవంతుని సమర్పించిన దండలను పూజారి గారు ప్రతి ఒక్కరి మేడలో వేస్తుంటే చాల చిత్రమైన ఫీలింగ్ ల అనిపించింది VIP దర్శనం లా :). ఆలయం లో కోతుల హడావుడి కనిపించింది పాపం ఆకలితో అవి ఏవి ఏవి దొరుకుతాయ అని ఎదురుచూస్తునట్టు అనిపించింది. ప్రసాదం స్వీకరించి తిరుగు ప్రయాణం అయ్యాము. కాస్త జన జీవన స్రవంతి నుంచి దూరంగా వుండి వచ్చాము అనిపించింది. ఎలా అంటే మన వూరి రాముల వారి గుడిలోకి వెళ్లివచ్చినట్టు.












మరిన్ని 
విశేషాలకు ఈ క్రింది లింక్ పరిశీలించగలరు

http://www.vishnutemplesofkarnataka.info/Kolar/mallurchikkatirupathi.htm

Thursday, October 24, 2013

షిరిడి సాయినాధుని మరియు శని సింగనాపుర్ శనీశ్వరుని దర్శనభాగ్యం - ఒంటరి పయనం ?


అక్టోబర్ 2 నాడు సెలవు దినం కావటం తో ముందు రోజు ఎన్నో సంవత్స రాలనుండి వాయిదా పడుతున్న నా శిరిడి యాత్రకు ట్టకేలకు శిరిడి సాయి నాధుని దర్శించుటకు అనుమతి లభించింది. బెంగళూరు నుండి సుమారు 24 గంటలు పడుతుంది ట్రైన్ లో. యశ్వంతపూర్ నుంచి కూడా వున్నాయి షిరిడి కి డైరెక్ట్ గా వున్నాయి. అన్ని ట్రైన్స్ అన్ని రోజులు నడవవు కాబట్టి ఒక వారం అంతా ఏ ట్రైన్స్ నడుస్తున్నాయో చూసుకుని మీకు వీలువున్న ట్రైన్ ని ఎంచుకోండి. ఐతే నేను  మేజస్టిక్ / బెంగళూరు సిటీ జంక్షన్ (SBC) నుండి కోపరగాన్ వెళ్ళే ట్రైన్ - కర్ణాటక యెక్ష్ప్రెస్ ను ఎంచుకున్నా (ఇది 16 గంటలే). దీనిలో తత్కాల్ దొరికింది. కోపరగాన్ నుండి షిరిడి సుమారు 15 కిలోమీటర్లు లోపుగా వుంటుంది. స్టేషన్ దిగి బయటకు వచ్చిన వెంటనే ఆటోలు దొరుకుతాయి. షిరిడి వెళ్ళే ప్రయాణికులతో మనం వెళ్ళితే 50 రూపాయలకు షేరింగ్ ఆటో లో వెళ్ళవచ్చు. మహారాష్ట్ర లో రోడ్డు సరిగా లేకపోవటం వల్ల కొంత ఇబ్బందే కాక సమయం కూడా వృదా అవుతుంది. షిరిడి ఆలయం ప్రదాన రహదారికి సరిగ్గా పక్కనే వుండటం వల్ల ఆటో వాళ్ళు ఆలయం ముందే దింపుతారు కాబాట్టి ఎదురుగానే కనిపిస్తుంది. ఒంటరిగా వెళ్ళేవాళ్లకి ఇబ్బందులు తప్పకపోవచ్చు. ఎందుకంటే పోలిసుల సూచనల దృష్ట్యా వసతి పెద్ద సమస్య రూములు ఎక్కడా ఇవ్వరు. నేను 3 సత్రాలు చూసాను మొదటిది అర్యవైశ్యులది - కాశి అన్నపూర్ణ సత్రం - రూం కోసం ప్రయత్నిస్తే 600 రూపాయలు సబ్యత్వం వుంటే 400 రూపాయలు చెప్పారు. తరువాత సైకిల్ బాబా సత్రం అందులో రూం విడిగా ఇచ్చే ప్రసక్తి లేదు అని పోలీసు వారి హెచరిక చూపారు. తరువాత గుంటూరు వారి సత్రం. అన్ని సత్రాలు కొంచెం అటు ఇటుగా 1 లేదా 2 కిలోమీటర్ల లోపే వుంటై. ఆటో వాళ్లకు ఇక్కడ బెంగళూరు వాళ్లకి మళ్లే షేరింగ్ కాన్సెప్ట్ తెలీదు అనుకుంటా. 30 నుంచి 50 వరకు అడుగుతారు ప్రతీసారి. గుంటూరు వారి సత్రం లో షేరింగ్ లో తీసుకున్నా, హాలు విశాలంగా వుంది. లాకర్ ఇచ్చారు. షేరింగ్ లో 50 రూపాయలు మాత్రమే - ఉదయం 7 నుంచి మళ్ళి 7 వరకు -24 గంటలు. 200 రూపాయలు అడ్వాన్సు తీసుకుంటారు, 150 వెనక్కి ఇచ్చేస్తారు ఒకరోజే ఉంటే. సౌకర్యంగానే వుంది. భజన సమాజం కూడా నడుపుతున్నారు. అల్పాహారం అవి చూసాను అక్కడ. బయట చేసాను కాబట్టి అవి ఉచితమా కాదా అనేది ఇదమిద్దంగా చెప్పలేను. అలయానికి గుంటూరు వారి సత్రం ఒక అర కిలోమీటరు వుంటుంది నడిచి పోవచ్చు లేదా రోడ్డు మీదకు వస్తే షేరింగ్ ఆటో లో రావచ్చు. దర్శనం 15 నిమిషాలలోనే అయిపోయింది. సాయినాధుని దర్శనం అయి మెట్లు దిగి బయటకు వచ్చేటప్పుడు ఎడమ పక్కగా తిరిగినవెంటనే మండపం లాగ కనిపిస్తుంది అక్కడ కూర్చుని ఎంతసేపు ఐన సాయి నాధుని ప్రత్యక్ష్యంగా తనివితీరా చూసుకోవచ్చు. ప్రతీచోట టీవీ అవీ కూడా ఏర్పాటు చేసారు లైవ్ లో చూడటానికి. తరువాత పక్కనే వేపచెట్టు తో కూడి గురుస్తాన్ వుంటుంది . ఆ తరువాత సాయి బాబా శిష్యుల సమాధులు, సాయి బాబా వాడిన వస్తువులతో కూడి మ్యూజియం ఆకట్టుకున్టై. ప్రసాదం కూడా అక్కడే 2 కౌంటర్లు వున్నాయి ఒకటి సొసైటీ వాళ్ళు నడిపేది. తరువాత మరొకటి వుంది. వీలైనంతవరకు  20, 35, 45 రూపాయలలో  45 రూపాయాలు వున్న ప్రసాదం తీసుకోండి తక్కువ రేటు వున్నది ఎక్కువ కాలం వుండదు పాడవుతుంది అని స్నేహితుడు చెప్పాడు. డ్రై ఫ్రూట్స్ కూడా వున్నాయి కాబట్టి అవి ఐతే ఇబ్బంది వుండదు అనుకుంటా. తరువాత సాయి బాబా నీళ్ళు తోడిన భావి, తానూ నీళ్ళు పోసి పెంచిన లెండీ భాగ్ తోట, పక్కన దత్తాత్రేయ చిన్న ఉపాలయం లాగ వుంది. ఇది అంతా ఆలయం మెట్లు దిగి ఎడమవైపుకు వస్తే, మరి కుడి వైపుకి వస్తే ఆంజనేయస్వామి ఉపాలయం, చావిడి, ద్వారకామాయి మందిరం. ఇంకా ఆలయం నుంచి బయటకు వచ్చి రోడ్ కి అవతలకు వస్తే ఖండోబా ఆలయమ్ వస్తుంది అండీ. ఇవన్నీచూడటం మరిచిపోవద్దు. ఇంకా గురువారం ఉదయం శని సింగనాపుర్ వెళ్ళాలని 8 గంటలకు టెంపుల్ పరిసరాలోకి వచ్చాను. వీలు ఐనంతవరకూ ఎట్టి పరిస్తితులలోను ఉదయమే బాయలుదేరండి. మళ్ళి సాయంత్రం ఐతే ఆలయం మూసేస్తారు అన్నారు. ఇక్కడ కూడా షేరింగ్ ఆటో లు వున్నాయి. రానుపోను కలిపి 100 తీసుకుంటారు. సుమారు మొత్తం 5 గంటలు పడుతుంది. పూజ సామాగ్రి అమ్మే షాపుల వాళ్ళతో జాగ్రత్త. పూజా సామాగ్రి మన తలకి తాకించి మంత్రం చెబుతారు. ఇంకా వాళ్ళు యెంత అడిగితె అంత ఇవ్వటమే. 250 తీసుకున్నారు అనుకుంటా మొదటిసారి కాబట్టి ). అక్కడ టాక్సీ స్టాండ్ నుండి ఆలయం దగ్గరే. ఇంతకు ముందు ఆలయం లో స్నానం చేసి బట్టలు విడిచిపెట్టి పంచె కట్టుకుని తైలాభిషేకం చేసి మళ్ళి స్నానం చేసి వచ్చేవారు అని చెప్పారు. అది తీసేశారు అని చెప్పారు. ఇప్పుడు మామూలు ఆలయం దర్శనం లాగానే చేసుకుంటాము. శనీశ్వరుని చుట్టూ రక్షణం ఏర్పాటు చేసారు దూరం నుంచి దర్శించుకోవటమే. పూజాసామాగ్రి, నువ్వులనూనె అవి అక్కడే ఏర్పాటు చేసిన వాటిలో పోయటమో, వెయ్యటమో చెయ్యాలి. నువ్వులనూనె పైపుల ద్వార స్వామి ని అభిషేకిస్తుంది. అక్కడ దర్శనం ఐన తరువాత మెల్లగా షిరిడి వచ్చేసాము. షిరిడి ఆలయం గేటు 4 అనుకుంటా అక్కడే విజయవాడ వారి హోటల్ అని వుంది. కొంచెం దూరం లో వుంది.  బావుంది ఇక్కడ, వెళ్ళితే ఇక్కడ ప్రయతించండి ). గురువారం మధ్యానం ఐతే దర్శనం పది నిమిషాలలోనే అయిపోయింది. ఆఖరుగా ఖండోబా దేవాలయం దర్శించి అక్కడకు 3 కిలోమీటర్స్ అనుకుంటా సాయి నగర్ రైల్వే స్టేషన్ అక్కడ నుంచి పూణే కి పయనమయ్యాను. పూణే విశేషాలు తరువాత పోస్ట్ లో !!!

నాకు ఈ ట్రిప్ లో ఎంతో సహాయం చేసిన నా స్నేహితులు సురేష్ & రమేష్, శిరిడి లోనే పరిచయమైన శ్రీనివాస్ కి నా కృతజ్ఞతలు.           

ఇన్ని చెప్పాను కదా మరి టైటిల్ లో క్వశ్చన్ మార్క్ ఏమిటి అని ఆలోచిస్తున్నారా ??? భగవంతుడు తోడుంటే ఒంటరి పయనం ఏమిటి అండీ మీరు మరీను ))).                              

Sunday, October 20, 2013

నాగలమడక సుబ్రహ్మణ్య మరియు పావగడ శ్రీ శనీశ్వర స్వామి దర్షనం

మేము ఇద్దరమూ - నేను, మా స్నేహితుడు బెంగళూరు నుండి
శుక్రవారము రాత్రి బయలుదేరాము మాకు అక్కడ APSRTC వాళ్ళ బస్సు స్టాప్, 10ఏ
ఫ్లాట్ఫారం చివరలో, 11.30PM పావగడకి కళ్యాణ దుర్గం బస్సు వుంది. ఆన్లైన్ లో తోమిదిన్నర కి ఒకటి,
పదిన్నరకి ఒకటి చూపించాయి. ఇదే ఆఖరి బస్సు అనుకుంటా. ఇక్కడకు పావగడ దాదాపు 170KM వస్తుంది.
మేము 3.30-4.00AM కి చేరిపోయాము. బస్సు స్టాప్ ఎదురుగానే టెంపుల్
వుంటుంది. ఒక ఫర్లాంగు దూరంలో బస చేయటానికి వీలుగా ఆలయం వాళ్ళదే సత్రం
వుంది. శని వారం మాత్రం కొంచెం ఎక్కువ రష్ వుంటుంది. ఒక రోజు ముందు రూం
బుక్ చేసుకోవాలి వుంటుంది. మిగతా రోజుల్లో రూమ్స్ ఖాళీగా
ఉంటాయి అని చెపారు. పురుషులకు మహిళలకు బాత్రూమ్స్ అవి వున్నాయి. ఓపెన్
ప్లేస్ లో పురుషులకు స్నానానికి కూడా అనువుగానే వుంది. ఆలయం లో మొదటి
దర్శనం లో చేసుకోవటానికి ప్రయతించండి. బయట పూజ సామాగ్రి 110 - 150 లోపు
తీసుకుంటారు.  సుమారు 4 నుంచి 4.30AM లోపు లైన్ లోకి వెళ్ళిపొండి. మొదటి
దర్శనం 5 కి ప్రారంభం అనుకుంట. ఆలయం లోపల 2 అంతస్తులలగా వుంటుంది ముందుగా
వెళ్ళితే నవగ్రహాలకు అభిముఖంగా కూర్చుంటాము. మొదటి దర్శనం తరువాత ఎక్కువ
సమయం పట్టదు. గుంపుగా ప్రదక్షిణం చేసేటపుడు నవగ్రహముల గద కొందరికి
ఇస్తున్నారు. వాటితో ప్రదక్షినమ్ చేస్తారు. లడ్డు ప్రసాదం మరియు కొంత నూనె
ప్రసాదంగా ఇచ్చారు. అక్కడకు దగ్గరలోనే ఆంజనేయస్వామి ఆలయం వుంది.
దేవస్థానం బయట బోర్డు వుంటుంది. అక్కడ ఎవరిని అడిగినా  చెప్తారు. బస్సు
స్టాండ్ దగ్గరలోనే వుంటుంది. కొండమీద కోట వుంది అన్నారు. మేము వెళ్ళలేదు.
11.00 AM తరువాత మేము అక్కడ నుండి 16 కిలో మీటర్లలో నాగల మడక సుబ్రహ్మణ్య
దేవస్తానం వుంటుంది. షేరింగ్ ఆటో లు లేవు. ఆటో వాళ్ళను ఆశ్రయించక పోవటమే
మంచిది. వందల్లో చెప్తారు. తెలుగు, కన్నడ పదాలు కొంచెం ఒకేలా ఉంటాయి కాబట్టి
తరువాత రేటు బేధం రిత్యా వివాదాలు అవుతున్టై .).  బస్సు కి పది రూపాయలు.
పక్కన అక్కడే ఉపాలయాలు కూడా వుంటై. తెలుగు, కన్నడ అందరికి వచ్చు కాబట్టి
భాషాపరంగా ఇబ్బంది వుండదు.

 మోహన్ కిషోర్ గారి బ్లాగ్ నాకు బాగా ఉపయోగపడింది. వారికి నా ధన్యవాదాలు.
'అలాగే కర్నాటక రాష్ట్రము నందు, మూడు ప్రఖ్యాత సుబ్రహ్మణ్య క్షేత్రాలు
కలవు. అవి ఆదిసుబ్రహ్మణ్య (కుక్కే సుబ్రహ్మణ్య), మధ్య సుబ్రహ్మణ్య (ఘాటి
సుబ్రహ్మణ్య) మరియు అంత్య సుబ్రహ్మణ్య (నాగలమడక సుబ్రహ్మణ్య) అనే మూడు
అద్భుతమైన క్షేత్రాలు. ఈ మూడూ కలిపితే ఒక సర్పాకారం ఏర్పడుతుంది అని, ఈ
మూడు క్షేత్రాలను ఎవరు దర్శించి స్వామిని ఆరాధిస్తారో, వారికి ఉన్న సకల
కుజ, రాహు, కేతు దోషములు, సకల నవగ్రహ దోషములు పరిహరింపబడి, స్వామి
అనుగ్రహమును పొంది, సకల అభీష్టములు పొందుతారు. ఇది సత్యం సత్యం పునః
సత్యం. '
http://shaktiputram.blogspot.in/2012_12_01_archive.html

రవి ప్రకాష్