Saturday, October 4, 2014

స్వయంభూ మద్ధి ఆంజనేయ స్వామి, గురవాయిగూడెం. జంగారెడ్డిగూడెం మండలం, పశ్చిమ గోదావరి జిల్లా. ఆంధ్రప్రదేశ్.

   అమ్మవారి శక్తి పీఠాల దర్శనానికి ఇంకా అర్హత రాలేదు అని ఆలోచిస్తుంటే, ఒరేయ్ ముందు ధను రాశికి ఏలినాటి శని ప్రారంభం అవుతుంది ముందు స్వామి ఆశీర్వచనాలు తీసుకో అన్నట్టు (శని వారం కూడా), ఈరోజు ఉదయం స్నేహితులతో కలిసి మద్ది ఆంజనేయ స్వామిని దర్శించుకోవటానికి వెళ్ళాను గురవాయిగూడెం లో యెర్ర కాల్వ తీరాన మద్వాసురుని తపః శక్తికి  మెచ్చి స్వామి స్వయంభూ గా వెలసిన క్షేత్రం ఇది. స్వామి వరంగా మద్వాసురుడు మద్ది రూపంగా ఇక్కడ స్వామిని సేవిస్తాడు. ఇక్కడ మద్వాసురుని పేరునే మద్ది ఆంజనేయ స్వామిగా, స్వామి పూజలందుకుంటున్నాడు. స్వామి ఒక చేతిలో పండు, మరొక చేతిలో గదతో దర్శనమిస్తారు. మద్వకుడి గురించి, స్తల పురాణం గురించి ఆఖరున లంకెలు ఇచ్చాను చూడగలరు.

ఉచిత దర్శనంతో పాటు, స్పెషల్ దర్శనం కూడా వుంది.  స్పెషల్ దర్శనం వారికి గర్భ గుడి లోకి ప్రవేశం వుంటుంది. టికెట్ వెల 20 రూపాయలు. ఈరోజు మాలలు ధరించిన భవానీ అమ్మ, అయ్యప్ప స్వామిలు బాగా వచ్చారు. సాధారణంగా మంగళ వారం రద్ది గా వుంటుంది. అనేకమంది యువతీ యవకులు 11 మరియు 108 ప్రదక్షిణాలు చేస్తూ కనిపించారు. 11 ప్రదక్షిణాలు చేసి స్వామిని భక్తులు కోరిక కోరుకుంటే సంవత్సరం లోపు తీరుతుంది అని ప్రతీతి. పెళ్ళికాని యువతీ యువకులు స్వామిని 7 మంగళ వారాలు 108 ప్రదక్షిణాలు చేస్తే పెళ్లి అవుతుంది అని కూడా ప్రతీతి. (నేను ప్రయత్నించలేదు లెండి అందుకే ఇంకా కాలేదేమో :) ).

మా చిన్నతనం లో పాత బ్రిడ్జి దగ్గర బస్సు దిగి కొంత దూరం నడుచుకుంటూ వచ్చేవాళ్లము. అప్పుడు ఇప్పుడు కనిపించేతంట పెద్దది కాదు. దేవస్తానం ని చాలా అభివృద్ధి చేసారు. ఇప్పుడు చాలా విశాలంగా వుంది. ఇతర భవనాలు కట్టించటం తో పాటు, భక్తులు ప్రసాదం వండుకోవటానికి గ్యాస్ తో కూడిన ఒక భవనం వుంది. అన్నదానానికి ఒక భవనం కూడా కట్టించారు.

దర్శనం వేళలు; ఉదయం 6 గంటల నుంచి మధ్యానం 1 వరకు. మళ్ళి 3 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు దేవాలయం తెరచి వుంటుంది. మంగళవారం మాత్రం ఉదయం 5 గంటల నుంచే తెరుస్తారు.

రూట్ వివరాలు : దేవాలయంకి ఏలూరు, రాజమండ్రి నుంచి బస్సు సౌకర్యం వుంది. రాజమండ్రి కి ఎక్కడ నుంచి ఐన బస్సు, రైలు, విమాన సౌకర్యాలు వున్నాయి. రాజమండ్రి నుంచి సుమారు 75 కిలో మీటర్లు వస్తుంది. ఏలూరు నుంచి 50 కిలోమీటర్లు వస్తుంది. విజయవాడ నుండి ఏలూరు మీదుగా వచ్చేవాళ్ళు, మునుపు వ్యాసం లో రాసిన ద్వారకా తిరుమల వెంకన్న స్వామిని దర్శించుకుని రావచ్చు. ద్వారకా తిరుమల నుంచి మద్ది కి 21 కిలోమీటర్లు. హైదరాబాద్, ఖమ్మం మీద నుంచి ఐతే జంగారెడ్డిగూడెం కి చేరుకుంటే దూరం ఐదు కిలోమటర్లు లోపే. వీటితో పాటు అనుసందానం చేసి జంగారెడ్డిగూడెం కొండమీద వెలసిన వెంకటేశ్వర స్వామి, ఏజన్సీ లో వున్న గుబ్బల మంగమ్మ గుడి కలుపుతూ APSRTC  బస్సులు నడుపుతున్నారు అని విన్నా. పంచారామాలు కి కూడా ఒక పేకేజిగా బస్సులు నడుపుతున్నారని కూడా తెలియవచ్చింది.

ఇక్కడకు సుమారు 1/2 కిలో మేటరు దూరం లోనే ఇదే గ్రామం లో అయ్యప్ప స్వామి ఆలయం అయ్యప్ప మాలలు దరించేవారికి దగ్గరగా, చాలా బాగా అనువుగా నిర్మించారు. జ్ఞాన ప్రసూనాంబ, దత్తాత్రేయుల ఉపాలయాలు క్రింద  అంతస్తులో, అయ్యప్ప ఆలయం మొదటి అంతస్తులో కనువిందుగా నిర్మించారు. జ్ఞాన ప్రసూనాంబ, దత్తాత్రేయుల ఉపాలయాలు వెనుక భవనం లో, అయ్యప్ప చరిత్రను ప్రతిభింబించేలా, చూపరులను ఆకట్టుకోనేవిదంగా కథ తో కూడిన బొమ్మల విగ్రహాలు చాలా బావున్నాయి. ఫోటోలు జతపరిచాను చూడగలరు.

జంగారెడ్డిగూడెం కి వచ్చే దారి లో సాయి బాబా స్తూపం దగ్గర కోతగా నిర్మించన ఆలయం కూడా చూసుకుని ఇంటికి చేరుకున్నాము. మొత్తానికి ఈరోజు దర్శనాలు బాగా జరిగాయి. 






































































ఏవైనా ఉత్సవాలు జరిగేటప్పుడు ఆలయం ఇలా కనిపిస్తుంది




















No comments:

Post a Comment