నింగి, నేల, గాలి, నీరు, నిప్పు - పంచభూతాలు. పంచభూతాలకు ప్రతీకాత్మకంగా నిలిచే ఆ పరమ శివ క్షేత్రాలు పంచభూతలింగ క్షేత్రాలు. అవి వరసగా చిదంబరం, కంచి, శ్రీకాళహస్తి, జంబుకేశ్వరం, అరుణాచలం. చిదంబరంలో నటరాజుగా, కంచిలో ఏకాంబరేశ్వరుడుగా, శ్రీకాళహస్తిలో శ్రీకాళహస్తీశ్వరుడుగా, జంబుకేశ్వరంలో జంబుకేశ్వరుడుగా, అరుణాచలంలో అరుణాచలేశ్వరుడిగా స్వామి తన దేవేరితో మనల్ని అనుగ్రహిస్తాడు. ఆయా క్షేత్రాల వైభవం దర్శించి, అనుభూతి చెందటమే కాని మాటలకి అందేది కాదు.
పంచభూత లింగ క్షేత్రాల గురించి వికీపీడియాలో మరింత సమాచారం ఇక్కడ చదవగలరు.
శ్రీ - సాలెపురుగు, కాళ - పాము, హస్తి - ఏనుగు కలిపి శ్రీకాళహస్తి అయినవి. ఆ కథ మీకు తెలిసినదే కదా ! అసలు ఈ క్షేత్ర వైభవం గురించి చదివితేనే ఇంత అద్భుతమైన క్షేత్రమా అని అనిపించక మానదు. ఒకసారి వికీపీడియా లో ఇక్కడ చదవండి.
ఇంకో లింక్ (శ్రీ చాగంటి కోటేశ్వర రావు గారు తమ ప్రవచనాలలో కూడా ఈ క్షేత్ర వైభవాన్ని గురించి ఇప్పటికే అద్భుతంగా చెప్పి వున్నారు. యూట్యూబ్ / http://telugu.srichaganti.net/ లో వున్నాయి అవి తప్పక వినండి).
చదివారు కదా ! ఇపుడు ఈ మధ్య మేము స్వామి ఆలయాన్ని దర్శించుకుని ఆశీస్సులు పొందాము. అదే ఈ ఆర్టికల్.
ఇంకోమాట మన జీవితాలలో ముఖ్యంగా, మన ఇళ్లలో ఆడవారు పాడే పాట 'శివ శివ శంకర ! భక్తవ శంకర! శంభో హర హర నమో నమో !' భక్త కన్నప్ప సినిమాలో లోనిది. సినిమాలో ఇతివృత్తం కూడా ఈ స్వామిదే ఈ క్షేత్రానిదే. శివుడి పరీక్షతో కంట నుంచి వస్తున్న రక్తధారని ఆపటానికి తన కన్నులు పీకిన తిన్నడే మన భక్తకన్నప్ప. ఎందరో భక్తులు అనుగ్రహింపబడ్డారు ఈ క్షేత్రంలో. మనం చిన్నపుడు చదువుకున్న శ్రీకాళహస్తీశ్వర శతకం రచించిన ధూర్జటి ఇక్కడివాడే. శ్రీకాళహస్తీశ్వర స్వామి ఒకానొక మహా భక్తుడు. ధూర్జటి ఆర్తి, భక్తి ఆ శతకంలో కనిపిస్తుంది మహాభక్తులు పేర్లు వచ్చాయి కాబట్టి ఒక రెండు మాటలు... బాధ, ఆశ, కోరిక, అర్థంతో మొదలయ్యి ఆనందం, నమ్మకమో లేదా ఓటమి, నిరాశ, అవమానభారం, దైన్యమో కలిగి కోపం, క్రోధంకి చేరుకొని, దిక్కులేనితనం, నిస్సహాయత ఆవరిస్తుండగా ప్రాణం ఐతే ఇంకా వుంది కదా ! ఇంతే కదా నువ్వు చేసేది అయినా నేను నిన్నే నమ్ముతాను. దిక్కులే అంబరాలిగా కలిగిన 'దిగంబరుడివి'నాకు ఇంక దిక్కు లేదు. నీవే దిక్కు. అంతటితో ఆగదు - పిచ్చి ప్రేమ, ఊగిపోయే మనస్సు, అవధూత లక్షణాలు అయినా బాలోన్మత్త పిశాచ అవస్ఠలకి చేరుకున్నట్టు అనిపిస్తుంది. ఏంటి ఈ సోది అనుకుంటున్నారా ! ఒక భక్తుడి మనసు 'లైఫ్ సైకిల్' చెప్తున్నా! ఎవరు ఏ స్టేజిలో వున్నారో మీరే సరి చూసుకోండి.
ఏ భావోద్వేగం లేకపోవటం అన్నట్టు అనిపించి, అన్ని భావోద్వేగాలు ఉండటం. మాస్ సాంగ్ చూస్తున్నా స్వామి గుర్తొచ్చి అప్రయత్నంగా కళ్ల నీళ్లు తిరిగితే ఆ పిచ్చి, ఉన్మాదం డిప్రెషన్ కిందకి వస్తాయో రావో మరి ఆ 'ఉన్మత్తశేఖరు'డే చెప్పాలి.
శ్రీకాళహస్తి ఆషామాషీ క్షేత్రం కాదు. 'దక్షిణ కాశీ'గా పేరుగాంచింది. స్వర్ణముఖీ నదీ తీరాన నెలకొని వుంది. వాయుతత్వానికి ప్రతీకాత్మకంగానే ఇక్కడ వున్న రెండు దీపాలలో ఒక దీపం రెప,రెప లాడుతుంటుంది. అక్కడ ప్రత్యేకంగా గాలి వచ్చే ఏర్పాటు లేకపోయినా, ఆలా రెప,రెప లాడుతుండటం ఇక్కడ ప్రత్యేకత. ఎందరో భక్తులు తరించిన క్షేత్రం. భారతదేశం నలుమూలలా ఇక్కడ రాహు, కేతు పూజలకు వస్తున్నారు అంటే ఈ క్షేత్ర మహాత్మ్యం అర్థం చేసుకోవచ్చు (వ్యక్తిగతంగా తీవ్ర ఉద్యోగ వడిదోడుకులతో కొన్ని సంవత్సరాల పాటు పడిన బాధ ఇక్కడ పూజతో పోయింది. కాంట్రాక్టు జాబ్ అయినా కూడా పూజ తరువాత 4.6 సంవత్సరాలు పాటు ఢోకా లేకుండా వుంది అంటే మీరే అర్థం చేసుకోవచ్చు ఇక్కడి క్షేత్ర మహిమ, రాహు,కేతు పూజల శక్తి ఎంత ప్రభావవంతమైనదో).
ఇకపోతే నేను బెంగళూరు నుండి రాత్రి బస్సు లు బాగానే ఉండటంతో, రాత్రి 10:45 కి రిజర్వేషన్ బస్సు పట్టుకుని తిరుపతిలో దిగేసరికి తెల్లవారగట్ల 3 అయింది. ఆ పక్కనే వున్న బస్సు స్టాండ్ నుంచి శ్రీకాళహస్తికి సరాసరి బస్సు పట్టుకుని వచ్చేసరికి ఇంకో 45 నిముషాలు పట్టింది.
గుడి ఎదురుగా బస్సు ఆపుతారు. లాడ్జిలు చూపిస్తామంటూ వెంటపడతారు :). మా తరువాత ట్రిప్ వెళ్లిన మా స్నేహితుడు ఆలా చూపిస్తాను అన్న వాడి వెనక వెళ్ళితే ఎక్కడో లోపల ఒక సందులో చూపించాడు అంట. యావరేజ్ గా వుంది అన్నాడు. అయినా ఎక్కడికో వెళ్లనవసరం లేదు ఎదురు గుండా చాలా లాడ్జిలు ఉంటాయి. నచ్చిన దాంట్లో దిగచ్చు. ఒక వందో, యాభయ్యో తగ్గించమంటే తగ్గిస్తారు కూడా.
దేవస్థానం వాళ్ళు లగేజి కౌంటర్ అక్కడే ఓపెన్ చేసారు. వాళ్ళు బస్సు దిగగానే మైక్ లో చెబుతుంటారు. ఇంక ఒక్క స్నానాదులు చేసుకుని పోతామంటే లాడ్జి వాళ్ళు ఒక ముప్పయ్యో , యాబయ్యో తీసుకుంటారు. మీ సౌలభ్యం, ప్రణాళిక అన్నమాట.
నేను అక్కడే కోమల్ లాడ్జిలో దిగాను. పరవాలేదు బానే వుంది. ఈలోపు మా స్నేహితుడు ఊరి నుంచి బయలుదేరి, ఏలూరు లో తిరుమల ఎక్ష్ప్రెస్స్ పట్టుకుని అక్కడికి చేరుకున్నాడు. శ్రీకాళహస్తి లో రైల్వే స్టేషన్ కూడా వుంది.
ఇద్దరం స్నానాదులు కానిచ్చుకుని రెండో దర్శనానికి వెళదామనుకుని బయలుదేరాము. ఇక్కడ ప్రొద్దున మూడు అభిషేకాలు ఉంటాయి. 6, 7, 9 గంటలకు. మేము ఉదయం 6.45 కల్లా టికెట్ తీసుకుని ఏడుగంటల దర్శనానికి వెళ్ళితే, అప్పటికి అయిపొయింది. తరువాత దర్శనం తొమ్మిది గంటలకి అని చెప్పారు. మాకేమి అర్థం కాలేదు. అదేమిటి అని అక్కడ వున్న ఒక అబ్బాయిని అడిగితే, అమావాస్య పూజలు వున్నాయి ఈరోజు అని చెప్పాడు. అదికూడా మొదటిసారి ఆలయంలో జరుపుతున్నారు. అందుకే వూళ్ళో వుండే మహిళలు భారీగా వస్తారు. అందుకే ఈరోజు ఒక గంట ముందుకు జరిపారు సర్ అని చెప్పాడు. ఉదయం 5, 6 గంటలకి రెండు అభిషేకాలు అప్పటికే అయిపోయాయి అన్నమాట. తరువాత అభిషేకం 9:15 అని చెప్పారు.
చెప్పాను కదా ! ఆ రోజు అమావాస్య . అసలు మేము వెళ్ళింది రాహు, కేతు పూజల కోసం. నాకు జాబ్ పోయింది. పెళ్లి గురించి అడగవద్దు :)). టైం అస్సలు బాలేదు. ఎందుకో స్వామి అభిషేక దర్శనంతో రాహు, కేతు పూజలు కూడా చేయిద్దామని బయలుదేరాము. ఆ మధ్యే మా చిన్ననాటి స్నేహితులు ఇద్దరు రాహ, కేతు పూజలు చేయించటం కూడా జరిగాయి. ఇక మా ఇద్దరమే మిగిలాము అని మేము కూడా బయలుదేరాము.
బెంగళూరు నుంచి వచ్చేటప్పడు బస్సు లో అస్సలు నిద్రపట్టలేదు. పక్క ప్రయాణికుడు కదులుతూ వుండటం వల్ల అంతా కలత నిద్ర. రెండు గంటలు అయినా పడుకున్నానో లేదో తెలియదు. ఇది ఒక పరీక్ష, రెండో పరీక్ష మా వాడికి జరిగింది. అప్పటిదాకా అలెర్ట్ గా వున్నాడు. ట్రాకింగ్ చూసుకుంటే అప్పుటికే శ్రీకాళహస్తి దాటిపోయింది. అప్పటిదాకా నాకు కాల్ చెయ్యాలి అన్న ఆలోచన రాలేదు. రేణిగుంట వెళ్లి మళ్ళీ శ్రీకాళహస్తి బస్సు లో వెనక్కి వచ్చాడు. ఆలా ఉంటాయి పరీక్షలు. భగవంతుని అనుగ్రహం కావాలన్న పుణ్యం ఉండాలి లేకపోతే ప్రారబ్ద కర్మ ఎంతలా అడ్డుపడుతుందో కదా !
నిలబడి నిద్ర పోవటం అంటే ఏమిటో అప్పుడే అర్థం అయింది. ఏమీ తినలేదు, నిద్ర లేదు, ఓపిక లేదు. టైం చూస్తే 9 దాటింది, 10 దాటింది. అభిషేకం ఊసే లేదు. అప్పటికే మూడుగంటలు అయింది మేము నిరీక్షిస్తూ. దానికి తోడు పంచె అవీ కట్టుకుని వెళ్ళాము. మా వాడికి మొదటిసారి పంచె కట్టుకోవటం. ఇంక మా కష్టాలు ఆ శ్రీకాళహస్తీశ్వరుని కెరుక.
ఇక్కడొక విషయం మీతో పంచుకోవాలి. అభిషేకానికి వచ్చే మగవారు పంచె ఖచ్చితంగా ధరించి తీరాలి. పైన చొక్కా వున్నా పర్లేదు కాని కింద మాత్రం పంచె ఉండాల్సిందే. ఆడవారు చీర లేదా సాంప్రదాయ వస్త్రాలు కట్టుకోవాలి. అభిషేకం కౌంటర్ బలి మంటపం దగ్గరే ఉంటుంది. అదే మనం కూర్చుని ప్రసాదాలు తింటుంటాము కదా దర్శనం అయి బయటకు వచ్చాక !. అక్కడన్నమాట. ఏ సమాచారం ఎవరిని అడిగినా చెబుతారు. ఇప్పుడున్న ఈ.ఓ. గారు ('భ్రమరాంబ' గారు) చాలా స్ట్రిక్ట్ అని చెప్పారు. అస్సలు ఊరుకోరు ఏదైనా తప్పు జరిగితే అని సిబ్బంది భక్తులని చాలా గౌరవంగా, శ్రద్దగా చూసుకుంటున్నారు. ఏ సమాచారం అడిగినా విసుక్కోకుండా సహాయకారిగా వున్నారు. ఈ విషయమై సంతోషమేసింది. అధికారిణిని అందుకే స్వామి పిలిపించుకున్నారేమో ! :).
శ్రీకాళహస్తి కి వెళుతున్నామంటే, మా స్నేహితుడు 'మారుతి' చెప్పిన ప్రణాళిక ఏమిటంటే, ఉదయం అభిషేక దర్శనం అమ్మవారు, అయ్యవారు ఇద్దరి అభిషేకం చూపిస్తారు 1,116/- టికెట్. తరువాత 10 గంటలకి రుద్ర, చండీ హోమం. అది 1,116/- రూపాయలు. ఇవి రెండూ పూర్తి అయ్యాక రాహు,కేతు పూజలు చేయించుకోండి. మూడు దొరకటం మీ ప్రాప్తం, ఆ స్వామి అనుగ్రహం అని చెప్పాడు. మేము ఎంత వీలయితే అంత అనుగ్రహం. ప్రయత్నిద్దాం ఆ పై శ్రీకాళహస్తీశ్వరుని దయ అని బయలుదేరి వచ్చాము అన్నమాట.
ఇంక వెనక్కి అభిషేకం దగ్గరకొస్తే, మేము అభిషేకం సమయం ఇంకా ఉండటంతో ఆ పక్కనే వున్న శ్రీకాళహస్తి శిఖర దర్శనం, యమ, చిత్రగుప్త ప్రతిష్ఠిత లింగ దర్శనాలు చేసుకున్నాము.
సాధారణంగా మాట్లాడితే, స్వామి మనకి పెట్టె పరీక్షలు పీక్స్ లో ఉంటాయి. ఇందాక చెప్పినట్లు నిల్చుని వున్నా విపరీతమైన నిద్ర ఒక పక్క, కొంత ధ్యానంలాగ, కొంత నిద్రలోకి పోతామేమో భయంతో కూడుకుని, పోకూడదు అన్న పట్టుదల, నిష్ఠ మరోవైపు మొత్తానికి రకరకాల స్థితుల మధ్య అభిషేకం మొదలు అయ్యే సమయం రావటంతో నిద్ర ఎగిరిపోయింది :)
మెల్ల,మెల్లగా అభిషేకానికి భక్తులు రాసాగారు. మా ఊరునుంచి ఒక జంట (క్లాస్మేట్స్) ఇద్దరు పిల్లలతో వచ్చారు.
అందరిని ఒకచోట కూర్చోబెట్టి, పేర్లు రాసుకుని, మెడలో ఒక టికెట్ కి ఒకరికి చొప్పున కండువా (తువ్వాలు) వేశారు. ఆడవారికి జాకెట్ ముక్క ఇచ్చారు.
ఆ తరువాత అక్కడ పూజ చేసి ముందుగా అమ్మవారి దర్శనానికి తీసుకెళ్లారు. అక్కడ జ్ఞానప్రసూనాంబ అమ్మవారికి అభిషేకం అద్భుతంగా జరిగింది. ఆ తరువాత అభిషేకం - క్షేత్ర దైవం అయిన మన శ్రీకాళహస్తీశ్వర స్వామికి.
సాధారణంగా ఏ ఆలయానికి వెళ్లినా ఎంత పెద్ద స్పెషల్ టికెట్ తీసుకున్నా, మనకన్నా ముందు కొందరు భక్తులు అంతరాలయం దర్శనం చేసుకోవటం గమనించి అసలు ఎలా చేసుకోగలుగున్నారు. మనం ఎలా చేసుకోలేకపోతున్నాము అన్న ప్రశ్న ఉండేది నాకు, దానికి సమాధానం ఈ యాత్రలో దొరికింది. నిజంగా సహాయపడిన మా స్నేహితుడి 'మారుతి'కి బ్లాగ్ ముఖాన నా హృదయపూర్వక కృతజ్ఞతలు.
అక్కడ మా అభిషేకం జరుగుతున్న సమయంలో నాలాగే విప్లవ భావాలున్న ఒకావిడ అక్కడ సిబ్బందితో, వాళ్లందరికీ టికెట్స్ ఉన్నాయా! ఇక్కడ చాలా సమయం నుంచి మేము నిరీక్షిస్తున్నాము అన్నట్టు అడిగింది. వాళ్ళు అందరికి టికెట్స్ వున్నాయి అని చెప్పి శాంతపరిచారు.
అభిషేకం పూర్తి అయ్యాక స్పటికలింగం దగ్గర ప్రసాదం పులిహోర, లడ్డు, వడ వున్న ప్యాకెట్స్ ఇచ్చారు.
లాడ్జికి వచ్చి మా ఇద్దరికీ భోజన ప్రసాదంలా తీసుకున్నా ఇంకా మిగిలింది. ఆ తరువాత కాసేపు ఉండి మళ్ళీ రాహు కేతు పూజకి కోసం బయలుదేరాము.
పాతాళ వినాయకుడి దర్శనం అప్పటికి అవ్వలేదు. రుద్రా,చండీహోమాలు చేయించుకోండి అని మైకులో చెబుతున్నారు కాని అప్పటికే రాహు, కేతు పూజ సమయం అవటంతో అక్కడికి బయలుదేరాము.
రాహు కాలం ఆరోజు మధ్యాహ్నం 1:30 నుంచి 3 గంటల దాకా ఉంది. (రాహుకాలం చార్ట్ గూగుల్లో వెతకండి. డౌన్లోడ్ చేసి పెట్టుకోండి. ఎప్పుడైనా ఉపయోగ పడుతుంటుంది).
మేము 1:10 కి లైన్లోకి వచ్చాము. అప్పటికే అందరూ కూర్చుంటున్నారు. అప్పటికి రాహుకాలం అవలేదు అని వెనక్కి పోతుంటే, లేదండి 1:30 రాహుకాలంలోనే పూజ ప్రారంభం అవుతుంది అంటే వెళ్లి కూర్చున్నాము.
రాహు,కేతు పూజలు ఇప్పుడు కనీస టికెట్ వెల 500 రూపాయలు. మునుపు 300 ఉండేది గరిష్టం 5000 కూడా వుంది. గుడిలోపల సహస్రలింగం ఉంటుంది. అక్కడే అభిషేకం వాళ్ళని కూర్చోపెడతారు. ఆ పక్కనే 5000 రూపాయల టికెట్ వాళ్లకి కూడా రాహు, కేతు పూజలు చేస్తారు. దాదాపు ధరల టికెట్ తీసుకున్న వారికందరికీ పెద్ద, చిన్న హాళ్లు ఉంటాయి. అక్కడ చేయిస్తారు.రాహు, కేతు పూజలు ప్రొద్దున 6.30 నుంచి రాత్రి 8:౩౦ వరకు జరుగుతాయి. మీకు వీలున్న సమయం చూసి ఒకసారి కనుక్కోండి.
మేము 750 రూపాయల టికెట్ తీసుకున్నాము. పూజ 30 నిమిషాలు పడుతుంది. తెలుగు, తమిళ్, హిందీ భాషలలో మైకులో చెబుతారు. తెలియకపోతే పక్క వాళ్ళు చేసినట్టు చెయ్యండి. ఏమీ పరవాలేదు. కష్టం ఏమీ ఉండదు. పూజా సామగ్రి దేవస్థానం వాళ్ళే ఇస్తారు. వస్త్ర ధారణ నియమాలు ప్రత్యేకంగా ఏమీ లేవు. మీ విజ్ఞత, సంస్కారం అంతే.
పూజ అయ్యాక రాహు,కేతు వెండి ప్రతిమలు శ్రీకాళహస్తీశ్వర స్వామి దర్శనం చేసుకుని మూడుసార్లు తల చుట్టూ తిప్పుకుని హుండీలో వెయ్యమంటారు. ఆలా చెయ్యటంతో, అంతటితో పూజ పూర్తి అవుతుంది. పూజ తరువాత వెళ్లి స్నానాలు చెయ్యటం లాంటివి ఏమీ చెప్పలేదు. కాబట్టి అవసరం లేదనుకుంటున్నాను. సాధారణంగా చెప్పేది పూజ అయ్యాక సరాసరి మీ ఇంటికి వెళ్లిపోండి అని. మీకు సాధ్యమైతే ఆ పని తప్పక చెయ్యండి. వేరే ప్రణాళికలు ఉంటే ముందే చేసుకుని రాహు,కేతు పూజలకు రావటం ఉత్తమం.
ఆఖరుగా పాతాళ వినాయక స్వామి దర్శనం చేసుకున్నాము. ఇక్కడ కొంచెం కష్టం అయింది. 20 అడుగుల కింద లోపల వున్న స్వామి ని దర్శించుకోవాలి అంటే ఒకరు తరువాత ఒకరు నలుగురు, ఐదుగురు చొప్పున వెళ్లి దర్శనం చేసుకుని వచ్చాక మిగిలినవారు మళ్ళీ ఒక బ్యాచ్ కింద వెళతారు. సన్నని ఇనుప నిచ్చెన లాగ ఉంటుంది కాబట్టి ఇక్కడ కొంచెం సమయం పట్టింది. దానికి తోడు పంచె వల్ల నాకు కొంచెం ఇబ్బంది అయినది :).
ఆ తరువాత మా పక్క రూమ్ లో వుండే స్నేహితుడి వూరు శ్రీకాళహస్తే కాబట్టి వూరు కొద్దిగా చూపించాడు. రామసేతు వంతెన మీదగా బైపాస్ రోడ్ మీదకి వెళ్ళాము. అక్కడే ఒక బాబా - జీన్స్ బాబా అంట మా స్నేహితుడు చెప్పాడు. కొందరు ఆశీర్వాదం తీసుకుంటున్నారు. అయన నచ్చితే సిగరెట్లు తీసుకుంటారు అనుకుంట లేకపోతె లేదు అని కూడా చెప్పాడు. అక్కడ ఆగలేదు మేము. ఒకచోట స్పెషల్ పేడా తీసుకున్నాము. చాలా వేడిగా బావుంది. నన్ను లాడ్జి దగ్గర దింపి తను వెళ్ళిపోయాడు. మేము సమయం అవ్వటంతో లాడ్జి ఖాళీ చేసి తిరుపతి వెళ్లి ట్రైన్ పట్టుకుని ఏలూరులో బైక్ ఉండటంతో అక్కడ దిగి బైకు మీద తెల్లవారగట్ల వూరికి వెళ్ళటం ఒకానొక మధురానుభూతి. ఫోటోలలో చూడండి అది.
శ్రీకాళహస్తి ఆలయ ఆన్లైన్ సర్వీసెస్ ప్రారంభించారని న్యూస్ లో చూసాను. సేవలు, పూజ టికెట్స్ బుక్ చేసుకోవచ్చు అని కూడా చదివాను. మీకు వీలు ఐతే ఒకసారి చూడండి.
శ్రీకాళహస్తి లో చుట్టుపక్కల చాలా ఆలయాలున్నాయి. మీరు బస్ దిగే చోట ఎడమపక్క కొండ మీద దుర్గమ్మ ఆలయం వుంది. దగ్గరలోనే సుబ్రహ్మణ్య స్వామి ఆలయం కూడా వుంది అని విన్నాను. శ్రీకాళహస్తి ప్రధాన ఆలయ గుడి పక్క కొండ మీదనే తిన్నడి గుడి కూడా వుంది. దర్శించగలరు.
కొసమెరుపు:
మొట్టమొదట శివకేశ బేధం గురించి చెప్పుకున్నాము కదా ! తిరుమల స్వామి ఆర్జిత సేవ లక్కీ డిప్ అంతకు ముందు కూడా, కొన్ని నెలలుగా ప్రయత్నం చేస్తున్న మాకు ఆ నారాయణుడే, శివుడయి శ్రీకాళహస్తిలో అభిషేక దర్శనం ఇచ్చాడు. శివ,కేశవుల అభేదమే కాదు 'నారాయణ', 'నారాయణి' గురించి కూడా మరోసారి మాకు అనుభవపూర్వకంగా చవి చూపించాడు. (ఒక్కమాటలో చెప్పాలంటే...ఆ పరబ్రహ్మ విభూతులు అనంతం). అర్థమైందా ? మరి ఇంకెందుకు లేటు చెప్పండందరూ ! శివాయ..విష్ణురూపాయ ...
అభిషేకం పూర్తి చేసుకుని బయటకు వస్తుంటే ఇక్కడ తీర్థం ఇవ్వబడును అని చూసాను. తీర్థం తీసుకుని అక్కడ వున్న స్వామి కి దండం పెడుతుంటే ఒక్కసారిగా గుండెలదిరేలా మంగళారతి సూచిస్తూ భేరీమృదంగాలు మోగుతున్నాయి. నా ఎదురుగా వున్న స్వామి ఎవరా అని చూస్తే దేవతల 'సుప్రీమ్ కమాండర్ అఫ్ ది ఫోర్సెస్' అయిన మన కార్తికేయుడే... సర్వ సైన్యాధ్యక్షుడు యుద్ధరంగంలో కాలుపెడితే మాములుగా ఉండదు కదా ! శంఖనాదాలు, బేరి,మృదంగాలు, కొమ్ముబూరల శబ్దాలు శత్రువుల వెన్నులో వణుకు పుట్టిస్తాయి. శత్రు జయం, దుష్ట శిక్షణ, శిష్ట రక్షణం.
వాయుక్షేత్ర దర్శనానికి 'వాయుపుత్రుడి' సహాయం లభించింది కదా ! ఆ పరమశివుని విభూతులు లెక్కించతరమా ! సముద్రంలో ఇసుక రేణువులంత !!!

No comments:
Post a Comment