"అరుణాచలం"... ఏదో సినిమాలో మహేష్ అన్న పేరులో వైబ్రేషన్స్ గురించి హాస్యంగా చూపిస్తాడు. హాస్యం మాట పక్కన ఉంచితే నిజంగా ఆ మహేశ్వరుడి ప్రతిరూపం "అరుణాచలం" పేరులో మాత్రం ఏదో తెలియని వైబ్రేషన్స్ ఉన్నాయి. అరుణాచల నామస్మరణ చెయ్యాలన్నా, అయన కృపకు పాత్రులు కావాలన్నా మన నుదుటిన ఆ చిన్న గీత ఉండాల్సిందే.
సర్వభక్షకుడు ఆ అగ్నిదేవుడు. తేజోరూపంలో ఉద్భవించినవాడు ఈ అరుణాచలేశ్వరుడు. బ్రహ్మ, విష్ణువులలో ఎవరు గొప్ప అని వాదులాట జరిగినప్పుడు ఉద్భవించిన, ఆద్యంతాలు లేని ఆ నిలువెత్తు రూపమే, ఘనీభవించిన ఆ తేజోరూపమే, ఇపుడు మనం చూస్తున్న ఆ అరుణ (ఎర్రనైన (అ-రుణ=పాపములను హరించునది )) అచలం (కొండ) - అరుణాచలం లేదా తిరువణ్ణామలై (తిరు (శ్రీ), అణ్ణామలై (పెద్ద కొండ).
మీకు యాత్ర గురించి కావాలన్నా, గిరిప్రదక్షిణ వివరాలు కావాలన్నా నెట్టింట్లో ముఖ్యంగా యూట్యూబ్ లో వీడియోలతో పాటు చాలా సమాచారం అందుబాటులో వుంది. శ్రీ చాగంటి కోటేశ్వరరావు గారు ప్రవచనాలు కూడా చేసారు అరుణాచలం - రమణ తత్వం మీద. అవి కూడా చూడండి.
మా యాత్ర విషయానికి వస్తే, బెంగళూరు మడివాళ నుంచి ఫ్లైఓవర్ మీదగా పోయే తమిళనాడు, కర్ణాటక బస్సులు వున్నాయి. ఫ్లైఓవర్ రైడర్ అని రాసి ఉంటాయి ముఖ్యంగా ఏదో ఘోస్ట్ రైడర్ లాగా:). యావరేజిగా 5 గంటలలో అరుణాచలం చేరిపోవచ్చు.
మేము అక్టోబర్ నెల పౌర్ణమి రోజు గిరి ప్రదక్షిణ కోసం బయలుదేరాము.
సాయంత్రం సుమారు 5 గంటల ప్రాంతంలో బయలుదేరి రాత్రికి అరుణాచలం చేరుకున్నాము.
"శివ సన్నిధి" ఆశ్రమంలో బస చేసాము. వాళ్లకి రూములుతో పాటు, విశాల హాళ్లు కూడా వున్నాయి. రమణాశ్రమం ముందు గణపతి ఆలయం వుంది. ఆ సందులోనే కొంచెం ముందుకి వెళ్లి ఎడమ సందులోకి వెళ్ళితే కనిపిస్తుంది.
హాలులో పడుకునేవారికి చాపలు, దిండులు ఉంటాయి. అక్కడే టాయిలెట్లు, బాత్రూమ్స్ ఉండటం వల్లన ఎటువంటి ఇబ్బంది ఉండదు. ఉచితమే అని చెబుతారు కానీ ఉచితానికి విలువలేదనేమో గాని ముందే డొనేషన్ తీసుకుంటారు. మాకు 200 రూపాయలు ఒక్కొక్కరికి హాలు నిమిత్తం తీసుకున్నారు. రూమ్స్ ఐతే కనీసం ఒక్కొరికి 500 రూపాయలు అడుగుతారు. గోదావరి జిల్లావాళ్ళు ఎక్కువ వున్నారు. అంటే మా వాళ్ళు :). ఆశ్రమం ఫౌండర్ భీమవరం రాజులు అన్నట్టు తెలిసింది.
ఇది కాక రమణాశ్రమం, శేషాద్రి ఆశ్రమం, ఆంధ్ర ఆశ్రమంతో పాటు మిగతా లాడ్జిలు గట్రా వున్నాయి. రమణాశ్రమంలో రూములు కష్టం. చాలా నెలలు ముందుగానే బుక్ చేసుకోవాలి. అది కూడా "పర్పస్ అఫ్ విజిట్" వంటివి చూసి ఇస్తారు.
నేను కావలిసినవి షాపింగ్ చేసి వచ్చి ఒక రెండుగంటలు పడుకుని 4 కల్లా తయారయి ఆ సందు చివర మెయిన్ రోడ్ దగ్గర వున్న విఘ్నేశ్వరుడికి విఘ్నాలు లేకుండా గిరి ప్రదక్షిణ పూర్తి చేపించమని ప్రార్ధనపూర్వక అనుమతి తీసుకుని బయలుదేరాము.
ఈ సారి మా స్నేహితుని సూచనతో నేను పంచె కట్టుకుని బయలుదేరాను. ఆలా మాట్లాడుకుంటూ అష్టలింగాల దర్శనం చేసుకుంటూ ప్రభాత సమయంలో మనకు కుడిపక్కగా ఆ ప్రభాకరుని ఉషోదయ కిరణాలు తాకుతూ వెలిగిపోతున్న ఆ అరుణాచలేశ్వరుని దర్శించుకుంటూ, సెల్ఫీలు దిగుకుంటూ :), చుట్టూ వున్న ప్రకృతిని ఆస్వాదిస్తూ ప్రదక్షిణ చేసుకుంటూ వెళుతున్నాము.
"ఆది అణ్ణామలై" టెంపుల్ ఇంతకు ముందు ప్రదక్షిణకి మొదటిసారి వచ్చినప్పుడు తెలియక దర్శనం చేసుకోలేకపోయాము. ఆ ఆలయం కూడా దర్శన దారిలో కనిపించదు. ఒకచోట లోపల సందులోకి వెళ్ళితే కనిపిస్తుంది. ఈసారి ఆ టెంపుల్ దర్శనం కూడా జరిగింది. చాలా సంతోషం వేసింది. అలాగే ఇంద్ర లింగం దర్శనం ఇంతకు ముందు జరగలేదు. అది కూడా ఈసారి జరిగింది. ఇది ప్రధాన ఆలయం దగ్గరగానే ప్రధాన రహదారి మీదే వున్నా మాములు దర్శనం దారిలో కనిపించదు. మా స్నేహితుడు 16-17 సార్లు పూర్తి గిరి ప్రదక్షణాలు అయ్యాయి. అందుకే రూట్లు అవి బాగానే తెలుసు.
ఆకలి, నిద్ర - అత్యంత ప్రభావవంతమైన క్షేత్రాలు దర్శించినప్పుడు మనకు పరీక్షలుగా మిగులుతాయి. రెండు గంటల కలతనిద్ర, పొద్దున్న ఖాళి కడుపు. తేరగా వస్తుందేంటి పుణ్యం :P. "సర్ఫ్ "వేసి కడిగినా పోవు మన(?) పాపాలు. ఆకలి, నిద్రతో పాటు అరుణాచలేశ్వరుని విధానాలు ఆయనకి ఉంటాయిగా మరి. మరికొన్ని ముందు, ముందు చెబుతాను.
పౌర్ణమి రోజులలో భక్తులు ఎక్కువగా వుంటారు. రాత్రి, పగలు తేడా లేకుండా ప్రదక్షిణలు చేస్తూనే వుంటారు. పౌర్ణమి రోజులలో బస్సులు రమణాశ్రమంనుండి నుండి ఒక కిలోమీటరు దూరంలో ఊరి బయటనే ఆపేస్తారు.
మాములుగా బస్సుల సమాచారం అడిగితే ఐతే బస్సు స్టాండ్ కి వెళ్ళండి లేకపోతే ఇందాక చెప్పా కదా అక్కడకి వెళ్ళండి అని చెప్పారు.
అష్టలింగాలు ఆలయాల దగ్గర, బయట వున్న అగ్నిమూకుడులో ఆత్కర్పూరం బిళ్ళలు వేస్తున్నారు అందరు. సరే అని మేము కూడా రెండు, రెండు వేసుకుంటూ వచ్చాము.
అష్టలింగాల గుడులలో మేము వెళ్ళినప్పుడు కొద్దిగా రద్దీ వుంది. మిగతా చోట్ల ఫ్రీగానే దర్శనాలు దొరికాయి.
రోడ్ పక్కన చిలక జ్యోతిష్యం వాళ్ళు కనపడితే మా వాడొకడికి బ్రేక్ ఇచ్చాడు :P. నూటయాబై అడిగాడు చేయి చూసినందుకు కూడా కలిపి. 40 ఇచ్చి వదిలించుకున్నాడు అనుకుంట :)).
మీరు గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు ఎక్కడా కూడా ఎక్కువసేపు కూర్చోకండి. మళ్ళీ నడవటం కష్టమైపోతుంది. లగేజి ఎక్కువ పెట్టుకోకండి. మీకు సమయం ఉంటే ఆలయం & రమణాశ్రమము ఒకసారి, గిరి ప్రదక్షిణ ఒకసారి పెట్టుకోండి. రెండూ ఒకేసారి అంటే చాలా సమయం పట్టవచ్చు గిరి ప్రదక్షిణకి సుమారు 4 నుంచి 5 గంటలు పడుతుంది. మూడు గంటలలో కూడా చేసేవాళ్ళు వున్నారు అనుకోండి. సమయం ఎక్కువ తీసుకోవటానికి కారణం ఏమిటంటే ప్రదక్షిణలో భాగంగా అష్టలింగాలతో పాటు లెక్కకు మిక్కిలి ఆలయాలు దారిలోనే ఉంటాయి.
సరే, మాకు అరుణాచల ఆలయ దర్శనం తరువాత అసలు కథ మొదలయింది.
మేము అరుణాచలేశ్వర ఆలయం దగ్గరకు చేరుకునేసరికి, మా వాడికి తెలిసిన అబ్బాయి ఫ్రీగానే వుంది దర్శనం చేసుకోండి అంటే సరే అని స్పెషల్ టికెట్ తీసుకుని లైన్ లో నిలబడ్డాము.
మొత్తం దర్శనం 1.5 నుంచి 2 గంటలు పట్టినట్టు వుంది.
పౌర్ణమి రోజులలో ఉపాలయాలు మూసేస్తున్నారు అనుకుంట. దర్శనం ఐతే లేదు.'క్యూ ' లైను ప్రధాన ఆలయంలోకి మాత్రమే వుంది. రద్దీ వుంది మేము వెళ్లిన రోజు.
అరుణాచలేశ్వర స్వామి, అపీత కుచాంబ అమ్మవార్ల దర్శనం అయ్యాక ప్రసాదం స్వీకరించాము. ప్రాణం లేచొచ్చింది. ప్రసాదం 10 రూపాయల వెల నిర్ణయించినా ప్రసాదం ప్రసాదంలానే పెడుతున్నారు. బహుశా నిధుల సమస్య కావచ్చు.
బయటకు వచ్చి ఇంద్రలింగం దర్శ నానికి బయలుదేరాం. కాళ్ళు కాలటం మొదలెట్టాయి. ఇంకా అగ్ని లింగ దర్శం కాలేదు. అప్పుడే 'అగ్ని' దేవుడు తన ప్రతాపం చూపించటం మొదలెట్టాడు.
రోడ్ చూసుకుంటూ, అక్కడక్కడా ఆగుతూ ఇంద్రలింగ దర్శనం అయింది. ఇంకా ఎండ పెరుగుతుంది. అప్పటికే 10 దాటింది. ఇంద్ర లింగం వరకు చేసేసరికి మినరల్ వాటర్ కొని అయిన గాని కాళ్ళు కడుక్కోవాలి అనేలాగా ఉందంటే పరిస్థితి అర్థం చేసుకోండి. ఒక పక్క కాళ్లు కాలిపోతున్నాయి మరో పక్క ఒకటే బాధ ఏమిటి ఈ పరీక్ష స్వామీ అని.
చేసిన పాపాలు ఇలా కాలిపోతున్నట్టు వున్నాయి అనే మరో మనసు తత్వం. ఇది సంచితమా, ప్రారబ్ధమా లేక ఆగామి కర్మ నా అని మరో ఆలోచన. నెత్తిమీద తడుతున్న సూర్యభగవానుడు భగ,భగ మండే మధ్యాహ్న మార్తాండుడిలా మారటానికి అట్టే సమయం లేదనిపించేలా వున్నాడు.
ఇంక లాభం లేదు అని బ్రహ్మస్రం బయటకు తీసాము. అదే అరుణాచలేశ్వరుని నామ స్మరణ. అంతే అప్పటిదాకా తగలబడిబోతున్నాయి అనుకున్న కాళ్ళు ఇదొక లెక్కా మేము భరించగలము అన్నట్టు సహకరించటం మొదలెట్టాయి. దాంతో హాయిగా అనిపించింది. మిట్ట మధ్యాహ్నం కూడా ఏమీ పట్టనట్టు మండుటెండలో ప్రదక్షిణ చేసే స్వామీ భక్తులను చూసి అబ్బురమనిపించింది. ఒక్క క్షణం సిగ్గు వేసింది. మనకి ఎప్పుడు ఆ స్థాయి వస్తుందా అని. ఇంక ఆ స్థాయి భక్తి ప్రసాదించమని స్వామిని కోరటం తప్ప చెయ్యగలిగినది ఏముంది.
రోడ్ మీద పారబోసిన నీళ్ల సహాయం తీసుకుంటూ, చెట్ల కింద కొంతసేపు ఆగుతూ, స్వామి మీద వున్న అపార దృఢ నమ్మకంతో - నీ నామస్మరణతో ఇంతకన్నా పెద్ద పరీక్షలే గెలవగలము అనే ఆలోచనలోనే రమణాశ్రయము చేరుకున్నాము.
రమణాశ్రమం చేరుకొని బయటనుండి ఒక ప్రణామం సమర్పించుకుని ప్రారంభస్థానం అయిన విఘ్నేశ్వరస్వామి ఆలయం చేరుకున్నాము.
మనలో చాలామంది ఏదో సహాయం కోసమో లేకపోతె ఏదో సమాచారం కోసమో ఫోన్ చేస్తాము. ఆ తరువాత మళ్ళీ ఏమైందో అవతల వారికి సమాచారం ఇవ్వము.
అదే భగవంతుని విషయంలో ఐతే ..? కృతఘ్నుడికి ఎవరూ కాపాడలేరు అని, అదే కదా శాస్త్రాలు తెలుపుతున్నాయి.
అందుకే మేము ఆ తప్పు చెయ్యలేదు. ఎక్కడ మా ప్రదక్షిణ మొదలు పెట్టామో, మళ్ళీ అక్కడికే వచ్చి విఘ్నేశ్వరునికి కృతజ్ఞతలు తెలుపుకుని పునః దర్శనంతో గిరి ప్రదక్షిణ పూర్తి చేసాము.
ఎవరైనా అరుణాచలంలో ఏదైనా చెయ్యాలి అనుకుంటే భక్తులు నడిచే మార్గంలో సమ్మర్లో ఢాబా మీద వేయించే కూల్ వైట్ పెయింట్ వేయిస్తే బాగుండును అనిపించింది. రోడ్డుకి పక్కన ఫుట్ పాత్ వున్నా కూడా భిక్షుకులు అని గాని, టైల్స్ వల్ల అని గాని, అది అంతగా నడవాలి అని వుండే స్థితిలో కనిపించదు.
అభిషేకం మూడువందలేమో ఉండాలి కాని ఇటీవల కౌంటర్లోనే రెండు వేలేమో చెప్పారు అన్నాడు ఒక స్నేహితుడు. అది పెంచారా, లేకపోతే మరొకటా అన్నది స్పష్టంగా నాకు తెలియదు కాని అభిషేకానికి మీకు అవకాశం చిక్కితే తప్పక ప్రయత్నం చెయ్యండి.
రెండు రోజులపాటు పౌర్ణమి గడియలు ఉండడం వల్ల ప్రదక్షిణ చేసే భక్తులు రద్దీ సగం తగ్గినట్టే అనిపించింది. మొత్తానికి ఆలా స్వామి దర్శనం, గిరి ప్రదక్షిణ ఆలా పూర్తి అయినవి.
గమనిక - అరుణాచల ప్రదక్షిణ చాగంటి వారు స్వామి నామాలు చెప్పమని చెప్పారు. అవి ఈ క్రింద లింక్ నుంచి డౌన్లోడ్ చేసుకోండి. మీరు ప్రదక్షిణకు వెళ్ళినప్పుడు చదువుకోండి.
http://media1.srichaganti.net/books/ArunachaleswaruniNamamulu.pdf
కొసమెరుపు:
-------------
మొదటిది
"భుజంగ భూషణ" నామం తెలుసా శివాష్టోత్తరంలో ? తెలియకపోతే మాకు కనిపించి ఫోటో తీసాము. మీకు కనిపించిందో లేదో చెప్పండి.
రెండోది
ముందు మాటలో ఆయన గారి పరీక్షలు గురించి ఇంతకుముందే చెప్పాను. ఇపుడు ఇవి రాసుకుంటుంటే మా రూమ్మేట్స్ బాటిల్స్ ఓపెన్ చేసుకుంటున్నారు. అరుణాచలేశ్వర! అసలు నీ లీలలకి అంతేముందయ్యా స్వామి :P. ఉంటాను స్వామి.
ఉపయోగకర లింక్ :

No comments:
Post a Comment